Radha: అప్పుడు చేసిన సాహసానికి గర్వంగా ఉంది: సీనియర్ నటి రాధ

Senior Actress Radha Shares A Memory Of Her Movie Tik Tik Tik - Sakshi

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ రాధ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 1980లో సీనియర్ స్టార్ హీరోలతో నటనతో మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో రాధ పేరుతోనే ఫేమ్ సాధించింది. కానీ ఆమె అసలు పేరు ఉదయచంద్రిక. దక్షిణాదిలో దాదాపు 250కు పైగా సినిమాల్లో నటించింది. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పింది. ఆమె కూతురు కార్తీక తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ఓ సినిమాలోని ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. అప్పట్లో కమల్‌హాసన్‌ సినిమాలో నటించిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారామె. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

రాధ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'టిక్ టిక్ టిక్ సినిమా షూటింగ్ రోజుల్లో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇదీ ఒకటి. అప్పటికి అది నా కెరీర్‌లో ఒక భాగం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన పోరాటాన్ని మెచ్చుకుంటున్నా. సరైన లుక్‌తో కనిపించిన మాధవికి ప్రత్యేక ప్రశంసలు. యాటిట్యూడ్‌తో పని చేయగలిగినందుకు ఆమెకు హ్యాట్సాఫ్. కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తొస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆలాంటి కొన్ని చెప్పలేని ఆలోచనలను ఇక్కడ పంచుకుంటున్నా.  ఈ అందమైన దుస్తులను తయారు చేసిన డిజైనర్ వాణీ గణపతికి మా కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో కమల్ హాసన్‌ కుర్చీలో ఉండగా.. రాధ, స్వప్న, మాధవి ఆయన వెనక నిలబడి ఉన్నారు.  కమల్ హాసన్ హీరోగా 1981లో తెరకెక్కిన టిక్ టిక్ టిక్ చిత్రంలో రాధ నటించింది.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top