సీరియల్‌లో ఒక్క వారానికి రాశీ ఎంత తీసుకుంటుందంటే...

Senior Heroine Raasi Remuneration For Janaki Kalaganaledu Serial  - Sakshi

సీనియర్‌ నటి రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ తన అందం, అభినయంతో ఎంతోమంది అబిమానులను సొంతం చేసుకుంది. శ్రీదేవి, మీనల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాశీ స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. 1997లో జగపతిబాబుతో నటించిన శుభాకాంక్షలు సూపర్‌ హిట్‌ కావడంతో ఇండస్ర్టీని తన వైపుకు తిప్పుకుంది.

ఆ తర్వాత బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టిన రాశీ 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. టాప్‌ డైరెక్టర్లు కూడా ఈమె డేట్స్‌ కోసం వెయిట్‌ చేసేవారంటే రాశీ పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు విలన్‌ పాత్రలతోనూ మెప్పించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో నెగిటివ్‌ రోల్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటివరకు ఫ్యామిలీ ఆడియోన్స్‌కు దగ్గరైన రాశీ నిజ సినిమాతో ఓ వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశీ ప్రస్తుతం ఓ బుల్లితెర ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న 'జానకి కలగనలేదు' అనే సీరియల్‌లో జ్ఞానాంబగా అలరిస్తుంది.  ప్రస్తుతం ఈ సీరియల్‌ టీఆర్పీ రేటింగులో దూసుకుపోతుంది. ముఖ్యంగా రాశీ పాత్రకు ఆడియోన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారట. హిందీ సీరియల్‌ దియా ఔర్ బాతి హమ్‌కు రీమేక్‌గా వచ్చిన ఈ సీరియల్‌తో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన రాశీకి మరోసారి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.  తన నటనతో బుల్లితెర శివగామిగా పేరు గాంచిన రాశీ ఈ సీరియల్‌ కోసం భారీ రెమ్యునరేషనే తీసుకుంటుందట. ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వారానికి దాదాపు లక్ష రూపాయల రెమ్యునరేషన్‌ అందుకుంటుందని టాక్‌ వినిపిస్తోంది. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్లే సీరియల్‌లో నటిస్తుందనే వార్తలను రాశీ ఖండించినట్లు సమాచారం. 

చదవండి : సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్‌ అనిత
అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top