Watch: Actress Pragathi Home Tour Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Actress Pragathi Home Tour: నటి ప్రగతి ఇల్లు చూశారా? హోంటూర్‌ వైరల్‌

Oct 27 2022 1:07 PM | Updated on Oct 27 2022 2:20 PM

Actress Pragathi Home Tour Video Goes Viral In Social Media - Sakshi

నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలుత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది. పలు చిత్రాల్లో అక్క, అమ్మ పాత్రల్లో నటించి తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

ఇక సోషల్‌ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే ప్రగతి జిమ్‌, వర్కవుట్‌ వీడియోలతో మరింత ఫేమ్‌ దక్కించుకుంది. రీసెంట్‌గానే సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ స్టార్ట్‌ చేసిన ప్రగతి ఫుడ్‌, బ్యూటీ, వర్కవుట్‌ వంటి పలు ఇంట్రెస్టింగ్‌ విశేషాలను నెటిజన్లతో పంచుకుంది. తాజాగా తన ఇంటికి సంబంధించి హోంటూర్‌ వీడియోను షేర్‌ చేసింది.

ప్రతి రూపాయి కూడబెట్టుకొని ఎంతో ఇష్టపడి ప్రతి వస్తువును కొనుగోలు చేసినట్లు ప్రగతి పేర్కొంది. అంతేకాకుండా తన ఇంట్లో ప్రతి వస్తువుకు ఓ కథ ఉందని, ప్రపంచంలోనే తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇల్లేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement