సీనియర్‌ నటి కన్నుమూత | Senior Actress Rita Bhaduri Dies | Sakshi
Sakshi News home page

Jul 17 2018 11:05 AM | Updated on Apr 3 2019 6:23 PM

Senior Actress Rita Bhaduri Dies - Sakshi

సీనియర్‌ నటి రీటా భాదురి(82) ఇక లేరు. బాలీవుడ్‌లో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో నటించిన రీటా.. గత కొంతకాలంగా వయసురిత్యా సమస్యలతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘రాజీ’ ఫేమ్‌, నటుడు శిశిర్‌ శర్మ తన ఫేస్‌బుక్‌లో తెలియజేశారు.  ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు. అమ్మ, అమ్మమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరు. 

కబీ హాన్‌ కబీ నా, క్యా కహెనా, దిల్‌ విల్‌ ప్యార్‌ వ్యార్‌, మై మాధురిదీక్షిత్‌ బన్‌నా చాహితీ హూ.. తదితర చిత్రాలతో రీటా మంచి గుర్తింపు పొందారు. హిందీతోపాటు పలు గుజరాతీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవటంతో.. బుల్లితెర వైపు ఆమె తన దృష్టిసారించారు. హస్రాతేన్‌, సారాభాయ్‌ వర్సెస్‌ సారాభాయ్‌, కిచిడీ, ఏక్‌ నయీ పెహ్‌చాన్‌, అమనత్‌, కుమ్‌కమ్‌ తదితర సీరియళ్లలో ఆమె నటించారు. నిమ్కీ ముఖియా సీరియల్‌లో ఇమ్రాతి దేవి పాత్ర.. రీటా బుల్లితెరపై వెలిగిపోయేలా చేసింది. ఆమె మృతికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం అంధేరీలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

రాత్రి రోడ్డు పక్కన నటి...

Advertisement
 
Advertisement
Advertisement