Actress Pragati: ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి

Actress Pragathi Share About Her Financial Issues In Latest Interview - Sakshi

నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ప్రగతి.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలు పోషించి ఆమె బాగా గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్య ఆమె సోషల్‌ మీడియాల్లో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండింగ్‌ పాటలకు స్టెప్పులేస్తూ, జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోలను తరచూ పంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ట్రోల్స్‌ బారిన పడుతోంది. అయితే తల్లి పాత్రలు చేస్తున్న ఆమె మొదట ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు దారుణంగా అవమానించారు: ప్రియదర్శి

నటనపై మక్కువతో మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆమె తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్‌ సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్ కొట్టేసింది. ‘వీట్ల విశేశాంగ’ మూవీతో ప్రగతి హీరోయిన్‌గా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో కూడా నటించింది. ఈ క్రమంలో ఓ సీన్‌కు ఆమె అభ్యంతరం చెప్పడంతో హీరో చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయని, దీంతో హీరోయిన్‌గా చేయొద్దని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ఆమె ఓ టాక్‌లో షో చెప్పింది. ఈ సందర్భంగా ప్రగతి తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది.

చదవండి: Actress Prema: మోహన్‌ బాబు గారిని చూస్తేనే భయం వేసేది, అలాంటిది..: ప్రేమ

లాక్‌డౌన్‌లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఫేస్‌ చేశానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘కరోనా సమయంలో షూటింగ్స్‌ లేవు. దీంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నా నగలు తాకట్టు పెట్టి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా’ అని తెలిపింది. ఇక అలాగే తన వైవాహిక జీవితం, విడాకులపై స్పందించింది. ‘నా వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నా పిల్లలను ఒంటరిగా నేనే చదివించాను. ఇప్పుడు వాళ్లు వారి లైఫ్‌కి సంబంధించిన నిర్ణయాలను సొంతంగా తీసుకునే స్థాయికి ఎదిగారు’ అంటే చెప్పుకొచ్చింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top