బేబీ జంట మూవీ.. క్రేజీ సాంగ్ రిలీజ్ | EPIC First Semester Manasa Vacha Lyrical song Video out now | Sakshi
Sakshi News home page

EPIC First Semester Movie: బేబీ జంట మూవీ.. క్రేజీ సాంగ్ రిలీజ్

Aug 20 2026 5:01 PM | Updated on Aug 20 2026 5:04 PM

EPIC First Semester Manasa Vacha Lyrical song Video out now

బేబీ మూవీతో ఫేమస్ అయిన టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌ పేరుతో వస్తోన్న మూవీకి ఆదిత్యహాసన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు.  ఈ సినిమాలోని మనసా వాచా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా.. ఎస్పీ చరణ్‌, కేఎస్‌ చిత్ర పాడారు. ఈ సాంగ్‌ను హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 11న థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement