ప్లీజ్.. దయచేసి నన్ను తీసుకోండి: ఉప్పల్ బాలు రిక్వెస్ట్ | Uppal Balu request To Bigg Boss Makers for Give One Chance | Sakshi
Sakshi News home page

Uppal Balu: 'ప్లీజ్.. దయచేసి నన్ను తీసుకోండి'

Aug 20 2026 3:49 PM | Updated on Aug 20 2026 3:50 PM

Uppal Balu request To Bigg Boss Makers for Give One Chance

బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్‌బాస్ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా రియాలిటీ వచ్చేనెలలో ప్రారంభ కానుంది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేసిన మేకర్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందని క్లారిటీ ఇచ్చేశారు. ఈ షోలో పాల్గొనే వారికోసం అగ్నిపరీక్ష పేరుతో కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ ఫైనల్ పోటీకి 15మందిని ఎంపిక చేశారు.

అయితే అగ్నిపరీక్షలో ఎలిమినేట్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌ ఉప్పల్ బాలు జడ్జిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నవదీప్ తనను అవమానించాడని వాపోయారు. తన వీడియోలు వల్గర్‌గా ఉంటాయని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎంపిక చేయనందుకు జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు.  

తాజాగా ఉప్పల్ బాలు మరో వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు విమర్శలు చేసిన ఉప్పల్‌ బాలు.. తాజాగా బిగ్‌బాస్‌ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా తనను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించాలని నాగార్జునతో పాటు మాటీవీని కోరారు. ఇది నా లాస్ట్ వీడియో అని.. తనకు అవకాశమిస్తే తప్పకుండా ఈ షో రేటింగ్ కూడా పెరుగుతుందని అన్నారు. నేను బిగ్‌బాస్ వెళ్లాలని నా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారని విజ్ఞప్తి చేశాడు. ఏ టాస్క్ ఇచ్చినా ఆడతానని.. ఫుల్ కామెడీ చేస్తానని ఉప్పల్ బాలు వేడుకుంటున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement