రన్యారావు వద్ద కోట్లలో డబ్బు.. ఆశ్చర్యపోయిన అధికారులు | DRI Officials Seize Kannada Actress Ranya Rao Assets, More Details About This Case | Sakshi
Sakshi News home page

రన్యారావు వద్ద కోట్లలో డబ్బు.. ఆశ్చర్యపోయిన అధికారులు

Mar 8 2025 7:13 AM | Updated on Mar 8 2025 9:48 AM

DRI officials seize Ranya Rao assets

బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్‌ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్‌ నుంచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ బెంగళూరులో ఆమె  దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను మూడురోజుల పాటు విచారించాలని  డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కు కోర్టు అనుమతి ఇచ్చింది.

కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్‌ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్‌ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాలు లేని ఒక నటి వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తన వద్ద ఉన్న డబ్బుకు సరైన ఆధారాలను ఆమె చూపించలేకపోయింది.

ఆమె గత ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఈ క్రమంలో రన్యారావు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ క్రమంలోనే దానిని కోర్టు తోసిపుచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement