మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు | Kannada Actor Ranya Rao Breaks Down In Court, Says Verbally Tortured And Threatened, Im Emotionally Broken | Sakshi
Sakshi News home page

మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు

Published Mon, Mar 10 2025 9:18 PM | Last Updated on Tue, Mar 11 2025 11:08 AM

verbally tortured and threatened, Not Physical Torture Ranya Rao

బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావును ఈరోజు(సోమవారం) బెంగళూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తన మొహంపై గాయాలు కనిపిస్తున్న క్రమంలో ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు డీఆర్ఐ అధికారులు. అయితే కస్టడీలో ఏమైనా  భౌతిక దాడులు జరిగాయా అని కోర్టు ప్రశ్నించగా.. తనను శారీరకంగా ఏమీ  ఇబ్బందులు గురి చేయడం లేదని, కానీ మాటలతో మానసికంగా హింసిస్తున్నారని కోర్టులో కన్నీటి పర్యంతమైంది.  అయితే మానసికంగా మాటలతో హింసిస్తున్నారని ఆమె చెబుతున్న వాదనను డీఆర్ఐ ఖండించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని, తమ నిబంధనల మేరjo దర్యాప్తు చేస్తున్నామన్నారు.  తమ దర్యాప్తును మొత్తం రికార్డు చేస్తున్నామని డీఆర్ఐ పేర్కొంది.

వైరల్‌గా మారిన ఫోటో


రన్యారావుకు చెందిన  ఓ ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,

‘మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.  ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెను స్పెషల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. 

గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement