నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ | ED raids Karnataka Home Minister medical college linked to Ranya Rao case | Sakshi
Sakshi News home page

నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

May 21 2025 2:36 PM | Updated on May 21 2025 3:29 PM

ED raids Karnataka Home Minister medical college linked to Ranya Rao case

సాక్షి, బెంగళూరు: నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నటి గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కర్ణాటక హోంమంత్రి పర్వమేశ్వరకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ ఈడీ గుర్తించింది.

హోమంత్రి పరమేశ్వర సిద్ధార్ధ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర విద్యాసంస్థలకు రన్యారావులకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు  ఈడీ నిర్ధారించింది. ఈ క్రమంలో బుధవారం పరమేశ్వర విద్యా సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. తన సోదాల్లో సిద్ధార్ధ కాలేజీ నగదు లావాదేవీల్ని ఈడీ పరిశీలించింది. 

ఈడీ అధికారులు దాడుల సమయంలో పరమేశ్వర ఇంట్లో లేరని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనుల్లో నిమిగ్నమైనట్లు సమాచారం.

రన్యారావు పెళ్లికి సీఎం,హోమంత్రి
మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావు అరెస్టు తర్వాత,కర్ణాటక మంత్రులు,మాజీ మంత్రులు సహా రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆనుమానించేలా పలు ఆధారాలు బయటపడ్డాయి.రన్యారావు వివాహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,హోమంత్రి పరమేశ్వరలు పెళ్లికి హాజరైన ఫొటోలో వెలుగులోకి వచ్చాయి. దీంతో రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో రాజకీయ రంగుపులుముకుంది. స్మగ్లింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ ఆరోపించింది.

రన్యారావుతో సంబంధాలు.. ఖండించిన డిప్యూటీ సీఎం డీకే
ఆ ఆరోపణల్ని కాంగ్రెస్‌ ఖండించింది.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తిరస్కరించారు. బీజేపీ తమ మంత్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కేవలం అవి అసత్య ప్రచారాలేనని స్పష్టం చేశారు.   

రన్యారావుకు బెయిల్‌
బంగారం స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యారావు బెయిల్‌పై విడుదలయ్యారు. బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ విశ్వనాథ్ చన్నబసప్ప గౌడర్ బెయిల్‌ మంజూరు చేశారు. ఇద్దరు ష్యూరిటీలతో పాటు, ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుతో విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement