
సాక్షి,బెంగళూరు: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ.పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విద్యాసంస్థలపై దాడులు జరిపారు. అయితే ఈ దాడులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో డీకే శివకుమార్.. జీ పరమేశ్వరను పరామర్శించారు. అనంతరం, డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. పరమేశ్వర.. రన్యారావుకు పెళ్లికి గిప్ట్ ఇచ్చారట. ఇందులో తప్పేముంది. నటికి గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పారు.
రన్యారావుది పెళ్లి కార్యక్రమం. ప్రజాజీవితంలో ఉన్నం. విద్యా సంస్థల్ని నడుపుతాం. తెలిసిన వారికి గిప్టులు ఇస్తుంటాం. వాటి ఖరీదు. ఒక్క రూపాయి, పది రూపాయలు, పది లక్షలు, ఐదు లక్షలు ఉండొచ్చు. అలాగే ఆయన (పరమేశ్వర)కూడా రన్యారావు పెళ్లి కానుకగా ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో తప్పేముంది’ అని అన్నారు. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వంటి చర్యల్ని తాము సమర్ధించబోమన్నారు.డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పరమేశ్వర స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయననే అడగండి’అని వ్యాఖ్యానించారు.