అన్ని రంగాల్లో ప్రభుత్వాలు విఫలం
రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర సర్కార్లు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని సీపీఐ(ఎంఎల్) కార్యదర్శి నాగరాజ్ పూజార్ ఆరోపించారు. శనివారం నగరంలోని శివశరణ మాదార చెన్నయ్య భవనంలో సీపీఐ(ఎంఎల్) ప్రాంతీయ సమ్మేళనాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ హిందూ మతం పేరుతో కలహాలు సృష్టిస్తూ అలజడులు రేకెత్తిస్తోందన్నారు. పెరుగుతున్న ధరలు, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాల పేరుతో వేతనాలు, రైతులకు సబ్సిడీలో కోత కోయడాన్ని తప్పుబట్టారు. దళితులు, మహిళలపై దౌర్జన్యాలు అధికమయ్యాయన్నారు. రాజ్యాంగాన్ని మూలన పడేసే దిశలో కేంద్రం పయనిస్తోందన్నారు. సమ్మేళనంలో అజీజ్, బసవరాజ్, కలమంగి, జగదీష్, ప్రహ్లాద్, మహేంద్ర, మహేష్, నిసార్‌లున్నారు.
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
హుబ్లీ: ధార్వాడ తాలూకా ముమ్మిగట్టి వద్ద జాతీయ రహదారిలో లారీ ఢీకొనడంతో మరో లారీ డ్రైవర్ తల ఛిద్రమై అతడు స్థలంలోనే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భద్రాపురకు చెందిన లారీ డ్రైవర్ మృతుడు. మ్యాంగనీస్ లోడ్ లారీని తీసుకొని అతడు బెళగావి వైపు వెళుతూ లారీని ముమ్మిగట్టి వద్ద నిలిపిన వేళ డ్రైవర్ కిందకు దిగాడు. ఆ సందర్భంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ అతడిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మహిళా కాంగ్రెస్ నిరసన
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి ఆధీనంలోని సహచర మంత్రి హర్దీప్ సింగ్ పురి మహిళల పట్ల అసభ్య పదజాలం వాడడం తగదని జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నిర్మల బెణ్ణె ఆరోపించారు. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. ఎఫ్‌స్టీన్ ఫైల్స్ కేసులో భాగస్వామి అయిన మంత్రి మహిళలను అవమాన పరిచే విధంగా వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో శశికళ, వందన, ప్రతిభారెడ్డి, సురేఖ, గాయత్రి, శ్రీదేవి, అశ్విని, మహాదేవి, మంజు, ఆరతి, లక్ష్మిలున్నారు.
పంచ గ్యారెంటీలతో రాష్ట్రం దివాళా
రాయచూరు రూరల్: పంచ గ్యారెంటీలతో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ఖజానాను ఆర్థికంగా దివాళా తీయించిందని బీజేపీ రాష్ట్ర సంచాలకుడు భాస్కరరావు ఆరోపించారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేనంతగా ధరలను పెంచారన్నారు. పంచ గ్యారెంటీల అమలుతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు అధికం కావడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాయచూరు జిల్లాను అభివృద్ధి చేయాలనే విజన్ ఏ రాజకీయ నాయకుడికీ లేదని విచారం వ్యక్తం చేశారు. సీఎం, డీసీఎం పదవుల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. రాయచూరు జిల్లాకు నిధులు రాబట్టడంలో లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ విఫలమయ్యారని విమర్శించారు. సిద్దనగౌడ, రవీంద్ర, మల్లికార్జున, వీపీ రెడ్డిలున్నారు.
పశువుల పట్టివేత
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని డి.కొండాపురంలో ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న నాలుగు పశువులను గ్రామస్తులు పట్టుకున్నారు. వివరాలు.. ఓ అపరిచిత వ్యక్తి నాలుగు పశువులను సుంకులమ్మ గుడి వద్దకు తీసుకువచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దుబ్బర్లపల్లి రామాంజనేయులు అతడితో మాట్లాడగా పశువులను అపహరించాడని అనుమానం వచ్చింది. కొద్దిసేపు తటాపటాయించిన అపరిచిత వ్యక్తి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి ఎంతసేపటికి రాకపోవడంతో తన అనుమానం నిజమైంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పశువులను చూసేందుకు ఎగబడ్డారు. పశువులు సరిహద్దున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులవని గ్రామస్తులు భావిస్తున్నారు.
అన్ని రంగాల్లో ప్రభుత్వాలు విఫలం
అన్ని రంగాల్లో ప్రభుత్వాలు విఫలం
అన్ని రంగాల్లో ప్రభుత్వాలు విఫలం


