సింధనూరు జిల్లా కల ఫలించేనా? | - | Sakshi
Sakshi News home page

సింధనూరు జిల్లా కల ఫలించేనా?

Mar 1 2026 7:37 AM | Updated on Mar 1 2026 7:37 AM

సింధన

సింధనూరు జిల్లా కల ఫలించేనా?

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా నుంచి 1998 ఏప్రిల్‌ 1న కొత్త జిల్లా కొప్పళను ఏర్పాటు చేశారు. అనంతరం అదే రాయచూరు జిల్లా కేంద్రం నుంచి సుమారు 100 కి.మీ.ల దూరంలో ఉన్న సింధనూరును కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని దశాబ్దాల నుంచి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చి నెలలో ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో నూతన జిల్లాను ప్రకటించాలని నేతలు ఒత్తిడి తేవడానికి రంగం సిద్ధమైంది. సింధనూరు– గంగావతి ప్రధాన రహదారి కూడలి నుంచి చతుర్భుజ రహదారికి అనుమతి లభించింది. కేఎస్‌ఆర్‌పీ 13వ పోలీస్‌ బెటాలియన్‌ను సింధనూరుకు కేటాయించి, అంబామఠానికి ప్రత్యేక హాస్టల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధీనంలో జవళగేర వద్ద 7,500 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది.

కార్యరూపం దాల్చని వంతెన నిర్మాణం

తాలూకా సరిహద్దుల్లో తుంగభద్ర నదిపై వంతెన నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం లభించలేదు. 2017–20 సంవత్సరాల మధ్యలో తుంగభద్ర నదికి అడ్డంగా వంతెన నిర్మాణం పెండిం గ్‌లో ఉంది. నూతనంగా సింధనూరు జిల్లా ఏర్పాటుకు సంబంధించి సింధనూరు, సిరుగుప్ప, మస్కి, కారటిగి తాలూకాలను కొత్త జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదన ఉంది. మరో వైపు సిరవార, కవితాళలను రాయచూరు జిల్లా నుంచి వేరు చేసి సింధనూరు జిల్లాలో చేర్చరాదంటూ ఆందోళనలు చెలరేగాయి. సింగాపుర– నిట్టూరుల మధ్య రాకపోకలకు అనుకూలంగా నూతన వంతెన నిర్మాణ పనులు కాగితాలకే పరిమితమైనట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

మూడు దశాబ్దాల నిరీక్షణకు కౌంట్‌డౌన్‌

వచ్చే బడ్జెట్‌లో ప్రకటనకు నేతల ఒత్తిడి

సింధనూరు జిల్లా కల ఫలించేనా?1
1/1

సింధనూరు జిల్లా కల ఫలించేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement