ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ సహజం | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ సహజం

Mar 1 2026 7:37 AM | Updated on Mar 1 2026 7:37 AM

ప్రతి ఉద్యోగికీ    పదవీ విరమణ సహజం

ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ సహజం

హొసపేటె: టీబీ డ్యాం ప్రభుత్వ పీయూ కాలేజీ ఉప ప్రిన్సిపాల్‌ మన్నే విజయకుమార్‌ పదవీ విరమణ వీడ్కోలు పీయూ కాలేజీ ఆవరణలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేష్‌ రామచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందడం సహజమన్నారు. విధి నిర్వహణలో చేసిన మంచి పనులు చిరస్థాయిగా ఉంటాయని అన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌ సుదీర్ఘంగా 31 ఏళ్ల పాటు ఉత్తమ సేవలు అందించారన్నారు. అనంతరం విజయకుమార్‌, ఆనందమ్మ దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి గౌరవించారు. బీఈఓ శేఖర్‌ హొరపేటె, విద్యా శాఖ డయట్‌ ఉపన్యాసకులు ఎల్‌డీ జోషి, విద్యాశాఖ నివృత్త అధికారులు, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, కోశాధికారి మల్లేశప్ప, కాలేజీ ఇన్‌చార్జి వైస్‌ ప్రిన్సిపాల్‌ భాస్కర్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల సంఘం అధ్యక్షురాలు అంకమ్మ, మధ్యాహ్న వంట తయారీ అధికారి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

ధార్వాడ ప్రత్యేక నగర పాలికె ఏర్పాటు అనుమానమే

హుబ్లీ ధార్వాడ పశ్చిమ

ఎమ్మెల్యే అరవింద బెల్లద

హుబ్లీ: ధార్వాడ ప్రత్యేక పాలికెకు నేడో రేపో తగిన అనుమతులు వస్తాయని పలువురు భావించగా ఈ విషయంలో సరి కొత్తగా నిధుల కేటాయింపు మేలు కోసం ప్రత్యేక పాలికె వద్దని హుబ్లీ ధార్వాడ పశ్చిమ ఎమ్మెల్యే, విధానసభలో విపక్ష నేత అరవింద బెల్లద సరికొత్తగా ఈ విషయాన్ని ప్రకటించారు. కలిసి ఉండటం వల్లనే కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిధులు వస్తాయని ఆయన ధార్వాడ ప్రత్యేక పాలికె ప్రతిపాదనకు మోకాలొడ్డారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రత్యేక పాలికెగా ధార్వాడను చేయడం వద్దని ఎప్పటిలానే ఒకటిలానే ఉండాలన్నారు. అభివృద్ధి విషయంలో ఇదే మంచిదన్నారు. గతంలో ఓ సందర్భంలో జంట నగరాలకు తగినన్ని నిధులు రావాలన్న ఉద్దేశంతో ప్రత్యేక పాలికె అవసరం ఉండేది. మారిన పరిస్థితుల వల్ల ప్రత్యేకం అయితే జంట నగరాల అభివృద్ధికి వెనుకబాటు తప్పదు. అందుకే ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాను. తానే కాకుండా కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, అలాగే ప్రత్యేక పాలికె పోరాట యోధులతో కూడా చర్చించి నచ్చచెప్పానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement