ద్వితీయ పీయూసీ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ద్వితీయ పీయూసీ పరీక్షలు ప్రారంభం

Mar 1 2026 7:37 AM | Updated on Mar 1 2026 7:37 AM

ద్విత

ద్వితీయ పీయూసీ పరీక్షలు ప్రారంభం

సాక్షి,బళ్లారి: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ప్రారంభమైన ద్వితీయ పీయూసీ పరీక్షల్లో భాగంగా ఉమ్మడి బళ్లారి జిల్లాలో కూడా ద్వితీయ పీయూసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు జరగనున్న ఈ పరీక్షలకు మొదటి రోజు విద్యార్థులు పరీక్ష కేంఽద్రాల వద్దకు ఎంతో టెన్షన్‌గా చేరుకుని నిర్ణీత సమయానికి కేంద్రాల లోపలికి వెళ్లారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, లెక్చరర్లు కూడా వచ్చి, ఆయా పరీక్ష కేంద్రాల వద్ద నంబర్లు చూసుకుని ఏయే తరగతి గదుల్లో పరీక్ష రాసేందుకు కేటాయించారో తెలుసుకుని వెళ్లారు. మొత్తం మీద మొదటి రోజు కన్నడ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు.

23 కేంద్రాల్లో పీయూసీ పరీక్షలు ప్రారంభం

హొసపేటె: ద్వితీయ పీయూసీ వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పరీక్ష కేంద్రాల్లో అవసరమైన సీసీ కెమెరాల అమరిక తదితర ఏర్పాట్లు చేసింది. గట్టి పోలీసు భద్రత నడుమ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ప్రథమ భాష పరీక్ష రాసారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,338 మంది విద్యార్థులు మొదటి రోజు ప్రథమ భాష పరీక్షకు హాజరయ్యారు. 576 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నగరంలోని ప్రభుత్వ పీయూ కాలేజీలో ఓ విద్యార్థి 45 నిమిషాల పాటు ఆలస్యంగా రావడంతో అనుమతించకుండా వెనక్కి పంపించారు. నగరంలో వీఎస్‌సీ, చిత్తవాడిగి, థియోసాఫికల్‌ కాలేజీ తదితర చోట్ల పరీక్షలు నిర్వహించారు. జిల్లాధికారిణి కవిత, ఎస్పీ జాహ్నవి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

టెన్షన్‌గా పరీక్ష హాలుకు

విద్యార్థుల హాజరు

పరీక్ష కేంద్రాల వద్ద

గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు

ప్రశాంతంగా తొలి రోజు పరీక్షలు

ద్వితీయ పీయూసీ పరీక్షలు ప్రారంభం1
1/1

ద్వితీయ పీయూసీ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement