రాసలీలల ఎఫెక్ట్‌.. ఐపీఎస్‌ రామచంద్ర రావు సస్పెండ్‌ | Karnataka DGP police K Ramachandra Rao has been suspended | Sakshi
Sakshi News home page

రాసలీలల ఎఫెక్ట్‌.. ఐపీఎస్‌ రామచంద్ర రావు సస్పెండ్‌

Jan 20 2026 8:09 AM | Updated on Jan 20 2026 8:56 AM

Karnataka DGP police K Ramachandra Rao has been suspended

బెంగళూరు: కర్ణాటక డీజీపీ లెవల్‌ ఆఫీసర్‌ కే రామచంద్రరావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయన రాసలీల వీడియోలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీఎం సిద్ధరామయ్య సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

డీజీపీ కార్యాలయంలోనే జరిగిన ఈ ఘటన దుమారం రేపడంతో.. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సివిల్‌ రైట్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ డీజీపీగా పనిచేస్తున్న రామచంద్రరావును సస్పెండ్‌ చేసింది. రామచంద్రరావు ప్రవర్తన నిబంధనలను ఉల్లఘించిందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ ముగిసేంత వరకు సస్పెన్షన్‌ కొనసాగనుందని స‍్పష్టం చేసింది. సస్పెన్షన్ కాలంలో, రాష్ట్ర ప్రభుత్వ రాతపూర్వక అనుమతి లేకుండా కే.రామచంద్రరావు ఎట్టి పరిస్థితుల్లోనూ హెడ్‌క్వార్టర్స్‌  విడిచి వెళ్లకూడదని ఆ ఉత్తర్వులో ఉంది.

రామచంద్రరావుకు నో అపాయిట్మెంట్‌
బెంగళూరులోని డీజీపీ కార్యాలయంలో రామచంద్రరావు మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు చూపించే వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.అయితే, ఈ క్లిప్స్‌ పాతవని, తాను నిర్దోషినని రామచంద్రరావు వాదిస్తున్నారు. డీజీపీ కార్యాలయంలోని సిబ్బంది ఈ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సంబంధిత వీడియోలో వెలుగులోకి వచ్చిన వెంటనే హోంమంత్రి జి.పరమేశ్వర నివాసానికి వెళ్లి పరిస్థితిని వివరించేందుకు వెళ్లారు. కానీ అక్కడ హోంమంత్రి, డీజీపీ రామచంద్రరావుల మధ్య భేటీ జరగలేదని తేలింది.   

 

ఎనిమిదేళ్ల నాటి పాత వీడియోలు
‘నేను షాకయ్యాను. ఇదంతా కల్పితం. ఆ వీడియో పూర్తిగా అబద్ధం. దాని గురించి నాకు ఏమాత్రం తెలియదు’అని మీడియాతో మాట్లాడారు.ఇది ఎలా, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారో అని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఈ రోజుల్లో ఏదైనా జరగవచ్చు. దాని గురించి నాకు ఏమీ తెలియదని చెప్పారు. గతంలో కే.రామచంద్రరావు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటి ప్రస్తావన.. తాజా ఘటన తర్వాత ప్రస్తావించగా.. అందుకు ఇప్పుడు వెలుగులోకి వచ్చినవి ఎనిమిదేళ్ల నాటి పాత వీడియోలు. నేను బెళగావిలో ఉన్నప్పటివి ’అని చెప్పారు.

 డీజీపీ ర్యాంక్‌ అధికారి కే.రామచంద్రరావు రాసలీలల వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై సోమవారం బెళగావి జిల్లా ఖానాపురలో సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఆ వీడియోలపై విచారణ చేస్తున్నామని తెలిపారు. తప్పు చేసినట్లయితే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనకు ఉదయమే తెలిసిందన్నారు. ఎంతపెద్ద అధికారి అయినా చట్టానికి అతీతులు కారన్నారు.

ఇదిలా ఉంటే.. గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారు బిస్కెట్ల స్మగ్లింగ్‌ కేసులో దోషి, సినీనటి రన్యారావుకు రామచంద్రరావు సవతి తండ్రి కావడం గమనార్హం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement