ఏడాది తర్వాత సినీ నటి రన్యారావు విడుదల | actress Ranya Rao Walk Out Of parappana Jail After Years | Sakshi
Sakshi News home page

ఏడాది తర్వాత సినీ నటి రన్యారావు విడుదల

Apr 23 2026 1:43 PM | Updated on Apr 23 2026 1:49 PM

actress Ranya Rao Walk Out Of parappana Jail After Years

బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు విడుదల అయ్యారు. విదేశాల నుంచి భారత్‌కు అక్రమంగా బంగారాన్ని  తీసుకొస్తూ బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె పట్టుబడిన విషయం తెలిసిందే. ఒక ఏడాదిలోనే 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ కేసు నమోదు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆమెను ఇక విచారించబోదని తెలిపారు. 

గత ఏడాది మార్చిలో రన్యారావు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్‌ గడువు ముగియడాన్ని కూడా డీఆర్ఐ అధికారులు సవాలు చేయబోదని, గడువు పొడిగింపు కోరడం లేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో బెంగళూరులోని ఆర్థికనేరాల నియంత్రణ కోర్టు  ఆమెకు  షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు తీర్పు అనంతరం పరప్పన అగ్రహార కారాగారం నుంచి రన్యారావు విడుదలయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement