బెంగళూరు: కన్నడ నటి రన్యారావు, ఆమె అనుచరులు నిర్వహిస్తున్న బంగారం స్మగ్లింగ్ దందాలో ఈడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.102 కోట్ల విలువచేసే బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తరలించారని ఈడీ కోర్టులో చార్జిïÙట్ వేసింది. ఇందులో ఉగాండా దేశానికి చెందిన ఏజెంటుతో నటి రన్యకు లింకులు ఉన్నట్లు తెలిపింది.
ఈడీ చార్జిషిటులో పేర్కొన్న ప్రకారం ఆమె దుబాయ్ నుంచే కాకుండా ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా బంగారాన్ని అక్రమంగా తరలించేది. దీనికోసం ఉగాండా ఏజెంట్‌తో సంప్రదించింది. దీనికోసం దుబైలో వీరా డైమండ్ ట్రేడింగ్ అనే పేరుతో కంపెనీని కూడా తెరిచింది.
రన్యారావు స్నేహితుడు రాజు, సదరు ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.33 లక్షలు చెల్లించారు. 2024, జనవరిలో రాజు బంగారం తేవడానికి ఉగాండాకు వెళ్లగా ఆ ఏజెంట్ తనకు మరింత ఎక్కువ డబ్బు.. అంటే రూ.1.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు తెలిసింది. రాజు వట్టిచేతులతో వచ్చాడు. స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టయిన రన్య బెంగళూరు పరప్పన జైల్లో గడుపుతోంది.


