
మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన చిత్రం టన్నెల్(Tunnel). కోలీవుడ్ హీరో అథర్వా మురళి సరసన ఈ చిత్రంలో కనిపించింది. తమిళంలో తనల్(Thanal) పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీకి రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లచ్చురామ్ ప్రొడక్షన్స్‌పై ఎ. రాజు నాయక్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అథర్వ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్‌గా మెప్పించారు.
తాజాగా ఈ చిత్రం నెల రోజులైనా కాకముందే ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు.