
తమిళ నటుడు అర్జున్ దాస్, రాజశేఖర్ కూతురు శివాత్మిక నటించిన 'బాంబ్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సెప్టెంబర్ 12న విడుదలై మంచి విజయం సాధించింది. కాళి వెంకట్, నాజర్, అభిరామి, సింగంపులి, బాలశరవణన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పాజిటివ్ టాక్స్‌తో రన్ అయిన ఈ మూవీకి 8.2 ఐఎండీబీ రేటింగ్‌తో గుర్తింపు పొందింది.
‘బాంబ్’ సినిమా ఏకంగా ఆరు ఓటీటీలలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్, సింప్తీ సౌత్, షార్ట్‌ఫ్లిక్స్, బ్లాక్‌షీప్, బ్రియో వంటి సంస్థలలో అక్టోబర్ 10న విడుదల కానుంది. అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ సరికొత్త కథతో మెప్పించింది.

బాంబ్ సినిమా ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఉంటుంది. ఒకే గ్రామం కాలపట్టి, కమ్మైపట్టి అనే రెండు చిన్న గ్రామాలుగా విడిపోయి గొడవలు పడుతుంటారు. ఆ గ్రామంలో దేవుణ్ని నమ్మని కతిరావన్ (కాళీ వెంకట్) అనుకోకుండా చనిపోతాడు. అయితే, అతణ్ని రెండు గ్రామాల మధ్యలో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చోబెడుతారు. కానీ మణిముత్తు (అర్జున్ దాస్) మాత్రం తన ఫ్రెండ్ కతిరావన్ చనిపోలేదని నమ్ముతాడు. కానీ, మిగిలిన వారందరూ అతడు చనిపోయాడనుకుని ఏడుస్తుంటే.. అతడు సడన్‌గా అపానవాయువు(Fart) వదులుతుంటాడు. దీంతో అతడు చనిపోయాడా లేదా అనే ఆందోళనలో గ్రామస్థులు ఉంటారు. ఇంతకూ అతను చనిపోయాడా లేదా.. ఒకవేళ చనిపోతే అలా ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.