
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath). ఈమె తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్' (The Game: You Never Play Alone Web Series). సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ రూపొందించారు. దసరా పండుగ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై స్ట్రీమ్ అవుతోంది.
వెబ్ సిరీస్
ఈ సందర్భంగా శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో తాను, సంతోష్ ప్రతాప్ గేమ్ డెవలపర్స్‌గా నటించామని చెప్పారు. గేమ్ డెవలపర్స్ అయిన తమను సామాజిక మాధ్యమాలు ఎలా బాధింపునకు గురిచేశాయి? తమ చుట్టూ ఉన్న వారిని ఎలా సమస్యల వలయంలో చిక్కుకునేటట్లు చేశాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ ది గేమ్ అని చెప్పారు. 7 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ సిరీస్ కోసం యూనిట్ అంతా ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు.
నాకు అదే ముఖ్యం
తాను అధికంగా పద్ధతిగల పాత్రల్లో నటించడానికి కారణం.. తనను ప్రేక్షకులు అలాంటి పాత్రల్లో చూడాలని కోరుకోవడమే అన్నారు. అయితే తనకు లవ్, రొమాన్స్‌తో పాటు సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్ కథాచిత్రాల్లోనూ యాక్ట్ చేయాలని ఆశగా ఉందన్నారు. ఎక్కువ సినిమాలు చేయడం లేదని కొందరు అడుగుతున్నారని.. తనకు ఎక్కువ చిత్రాలు నటించడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచిగా నటించి అభిమానులను అలరించడమే ముఖ్యమని పేర్కొన్నారు.