
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన చిత్రం మదరాసి. అమరన్ సూపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న బిగ్ స్క్రీన్‌పై సందడి చేసింది. అయితే ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా.. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూ.100 వసూళ్లు రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా మెప్పించింది.
ఈ యాక్షన్ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ వైరల్ కావడంతో అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు శివ కార్తికేయన్తో వీడియో రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విద్యుత్ జమాల్ విలన్గా మెప్పించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.
మదరాసి కథేంటంటే?
తమిళనాడులో గన్ కల్చర్ తీసుకురావాలనేది విరాట్(విద్యుత్ జమ్వాల్) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్లాన్. ఇందులో భాగంగా గన్స్ ఉన్న ఆరు కంటెయినర్లని రాష్ట్రంలోకి తీసుకొస్తుంటాడు. ఈ సంగతి ఎన్ఐఏ(NIA)కి తెలుస్తుంది. ఆఫీసర్ ప్రేమ్(బిజు మేనన్).. తన టీమ్‌తో కలిసి వీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ పెద్ద గొడవ. ఆఫీసర్ ప్రేమ్ తీవ్ర గాయాలపాలవుతాడు. మరోవైపు లవ్ ఫెయిలైందని రఘు(శివకార్తికేయన్) ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఫ్లైఓవర్ పై నుంచి దూకేస్తాడు. ఇతడికీ గాయాలవుతాయి. అనుకోకుండా ప్రేమ్-రఘని ఒకే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొస్తారు. తర్వాత ప్రేమ్ లీడ్ చేస్తున్న మిషన్‌లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? రఘు ప్రేమించిన మాలతి (రుక్మిణి వసంత్) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
Brace yourself for a mad ride with yours truly Madharaasi ❤️🔫#MadharaasiOnPrime, Oct 1@SriLakshmiMovie @Siva_Kartikeyan @ARMurugadoss @anirudhofficial @VidyutJammwal #BijuMenon @rukminitweets @actorshabeer @vikranth_offl @SudeepElamon pic.twitter.com/McLGlMBEN4
— prime video IN (@PrimeVideoIN) September 26, 2025