
రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార చాఫ్టర్-1(Kantara Chapter1). ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజైన తర్వాత ఏ ఓటీటీకి రానుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.
తాజాగా కాంతార ఛాప్టర్-1 ఓటీటీకి సంబంధించిన సినీ ప్రియులు సైతం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కుదుర్చుకున్న డీల్ ప్రకారం.. ఈ సినిమా ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ చూసి ఓటీటీ డేట్ రివీల్ చేయనున్నారు. అప్పటి వరకు కాంతార ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.