
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కన్నడ హీరో వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. కాంతార మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో రిషబ్ శెట్టి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది దసరా కానుకగా కాంతార: చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. కేవలం 16 రోజుల్లోనే రూ. 717 కోట్ల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే పలు స్టార్ హీరోల చిత్రాలను సైతం అధిగమించింది. శాండల్‌వుడ్ చరిత్రలోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందించారు.