
కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార: చాప్టర్ 1 రెండు వారాలు దాటినా ఏ మాత్రం కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే రూ.650 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-10లో నిలిచింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ చిత్రాలను అధిగమించింది. కేవలం హిందీలోనే రూ.155.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో ప్రభంజనం సృష్టించిన కాంతార మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్(రూ. 152.65 కోట్లు), సాహో(రూ. 145.67 కోట్లు, బాహుబలి-ది బిగినింగ్' (రూ. 118.5 కోట్లు), పుష్ప: ది రైజ్ - పార్ట్ I(రూ. 106.35 కోట్లు) చిత్రాలను దాటేసింది. ఈ జాబితాలో పుష్ప-2 రూ. 812.14 కోట్ల వసూళ్లతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బాహుబలి-2(రూ. 511 కోట్లు), కేజీఎఫ్ -2 రూ. 435.33 కోట్లు, కల్కి 2898 ఏడీ రూ. 293.13 కోట్లతో ఉన్నాయి. ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది. దీపావళి సెలవులు రావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
కాకగా.. ఈ సినిమాను 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు,
హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు..
పుష్ప -2: రూ. 812.14 కోట్లు
బాహుబలి- 2: రూ. 511 కోట్లు
కెజిఎఫ్- 2: రూ. 435.33 కోట్లు
కల్కి 2898 ఏడీ: రూ. 293.13 కోట్లు
ఆర్ఆర్ఆర్ : రూ. 272.78 కోట్లు
రోబో2: రూ 188.23 కోట్లు
మహావతార్ నరసింహ: రూ. 188.15 కోట్లు
కాంతార చాప్టర్-1: రూ. 155.5 కోట్లు
సలార్ - పార్ట్ I: రూ. 152.65 కోట్లు
సాహో : రూ. 145.67 కోట్లు