‘శంషాబాద్’లో కిలో బంగారం స్వాధీనం | Customs officials seize 1 kilo of gold from traveller in shamshabad airport | Sakshi
Sakshi News home page

‘శంషాబాద్’లో కిలో బంగారం స్వాధీనం

Nov 8 2013 2:09 AM | Updated on Jul 29 2019 5:43 PM

‘శంషాబాద్’లో కిలో బంగారం స్వాధీనం - Sakshi

‘శంషాబాద్’లో కిలో బంగారం స్వాధీనం

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం థాయ్ ఎయిర్‌వేస్‌కు చెందిన టీజీ 329 విమానంలో బ్యాంకాక్ నుంచి విశాఖపట్నానికి చెందిన సురేష్ (35) శంషాబాద్ వచ్చాడు. అతడు జీన్స్ ప్యాంటుకు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో రెండు బంగారు బిస్కెట్లు, లోదుస్తుల్లో మరో రెండు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారం దాదాపు కిలో బరువు ఉంది. దీని విలువ రూ. 30 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు సురేష్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement