విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత | Capture gold in 1kg at airport | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత

Feb 20 2018 4:42 AM | Updated on Feb 20 2018 4:42 AM

Capture gold in 1kg at airport - Sakshi

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి 1,047 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం జజీరా ఎయిర్‌లైన్స్‌ జె9–608 విమానంలో కువైట్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తితో పాటు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వారిని తనిఖీ చేశారు.

వ్యక్తి తన ప్యాంటు వెనుక భాగంలో దాచిన 4 బంగారు కడియాలు, మహిళ తన దుస్తుల లోపల దాచుకున్న 6 బంగారు కడియాలు బయటపడ్డాయి. సుమారు 1,047 గ్రాములు బరువు ఉన్న వీటి విలువ రూ.32,87,580 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వీరిద్దరు కలిసే బంగారం అక్రమ రవాణా చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement