ఎయిర్ పోర్ట్లో 30 కేజీల బంగారం పట్టివేత | Customs seize 30 KGs of gold at Madurai airport | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్ట్లో 30 కేజీల బంగారం పట్టివేత

Oct 4 2015 12:03 PM | Updated on Sep 3 2017 10:26 AM

ఎయిర్ పోర్ట్లో 30 కేజీల బంగారం పట్టివేత

ఎయిర్ పోర్ట్లో 30 కేజీల బంగారం పట్టివేత

మదురై ఎయిర్ పోర్ట్లో ఆదివారం భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై : మదురై ఎయిర్ పోర్ట్లో ఆదివారం భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోలంబో, దుబాయిల నుండి వచ్చిన విమానాల్లో దాదాపు 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. అనంతరం సదరు విమానాల్లో ప్రయాణించిన  10 మంది ప్రయాణీకులను అధికారులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులను అప్పగించారు.

పట్టుబడిన బంగారం విలువ రూ. 8.38 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. సదరు విమానాల్లో భారీగా బంగారం అక్రమ రవాణా అవుతున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఈ విమానాలు ఎయిర్ పోర్ట్ చేరుకోగానే.... కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement