బంగారం పట్టివేత | Customs Officials Seize Gold Smuggled At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

బంగారం పట్టివేత

Apr 7 2022 8:02 AM | Updated on Apr 7 2022 12:41 PM

Customs Officials Seize Gold Smuggled At Shamshabad Airport - Sakshi

సాక్షి, శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణంగా తనిఖీ చేశారు.

అతడి ప్యాంట్‌ లోపలి భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబులో 475 గ్రాముల బంగారాన్ని గుర్తిచి బయటికి తీశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 24.8 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

(చదవండి: డ్రగ్స్‌ సరఫరాదారుల అరెస్ట్‌)

Advertisement
 
Advertisement
Advertisement