విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత | airport in one and half kg gold Capture | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత

Jun 2 2014 12:29 AM | Updated on Sep 2 2017 8:10 AM

శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన కెన్యా దేశానికి చెందిన రజీయా లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో 1,300 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.

అంతకుముందు ఉదయం దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఎలాంటి రశీదులు లేకుండా తీసుకొచ్చిన 150 గ్రాముల బంగారాన్ని కూడా  అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement