విమానాశ్రయంలో ఏకంగా 109 జంతువులు కలకలం...షాక్‌లో అధికారులు

Indian Women Luggage Contain 109 Live Animals: బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళలను అరెస్టు చేశారు. ఏకంగా 109 జంతువులను అక్రమంగా తరలించేందుకు యత్నించి పట్టుబడ్డారు. ఈ మేరకు నిత్య రాజీ, జకియా సుల్తాన్ అనే ఇద్దరు మహిళలు రెండు లగేజ్‌ల్లో జంతువులు తరలించేందుకు యత్నించారు. ఆ మహిళల లగేజ్‌ల్లో బతికే ఉన్న రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లోలు, 35 తాజేళ్లు , 50 బల్లులు, 20 పాములు కనిపించాయని అధికారులు వెల్లడించారు.
ఆ మహిళిద్దరూ విమానంలో చెన్నైకి వెళ్లాల్సి ఉందని చెప్పారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇటీవల, గత నెలలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు థాయ్‌లాండ్ నుంచి వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన రెండు ప్రయత్నాలను అడ్డుకున్నారు కూడా.