పైలట్ల కొరత, విమానాల రద్దు, పైలట్ల పనిగంటల తదితర అంశాలపై ఇప్పటికే చాలా విమర్శలెదుర్కొన్న ఇండిగో మరో వివాదంలో చిక్కుకుంది. డ్యూటీ సమయం ముగిసిన తర్వాత కూడా మరో విమానాన్ని నడపమని సంస్థ కోరడం, దీనికి పైలట్ నిరాకరించడంతో గందరగోళం నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముంబై నుండి థాయ్‌లాండ్‌లోని క్రాబీకి వెళ్లే ఇండిగో విమానానికి సంబంధించి గురువారం నాడు ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటనపై ఇండిగో స్పందన ఎలా ఉందంటే..
ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఉదయం 4:05 గంటలకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం, 6E 1085, మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. ఉదయం 10 గంటలకు క్రాబీలో ల్యాండ్ కావాల్సిన విమానం, ఫ్లైట్‌రాడార్24 ప్రకారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి చేరుకుంది.
New:
-Pandemonium in @IndiGo6E flight from Mumbai to Krabi
-Passengers wanted to beat pilot
-Who is said to have refused to operate flight as he was breaching his duty time & had told airline in advance
-But flight was boarded & passengers were stuck inside for 3 hours
✈️ pic.twitter.com/vAYWjCBHov— Tarun Shukla (@shukla_tarun) January 15, 2026
విమానంలోని ప్రయాణికులకు, క్యాబిన్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. తన డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి పైలట్ విమానాన్ని నడపడానికి నిరాకరించాడని, ఈ కారణంతా తాము మూడు గంటలు పాటు ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. విమానం ఆలస్యం కారణంగా తమకు జరిగిన అసౌకర్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్లాన్ల పరిస్థితి ఏంటి అని ఒక ప్రయాణికుడు మండిపడ్డారు. మరి కొంతమంది తీవ్ర ఆగ్రహంతో దుర్బాషకు దిగారు.
ముంబై-క్రాబీ విమానంలో జరిగినట్లు నివేదించబడిన ఈ సంఘటనను వీడియో తీసి రచయిత తరుణ్ శుక్లా ఎక్స్‌లో షేర్ చేశారు. దీని ప్రకారం ‘‘ఇండిగో హాయ్ హాయ్" అని నినాదాలు చేయడం చూడవచ్చు. ఒక మహిళ "ఎలుకలా ఎందుకు దాక్కున్నాడు? బ్లడీ ఇడియట్" అని అరవడం, మరో ప్రయాణికుడు విమానం ఎగ్జిట్ డోర్‌ను తన్నడం కూడా కనిపించింది.
ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి
ఇండిగో స్పందన
విమానం ఆలస్యంపై ఇండిగో స్పందించింది. ఇన్‌కమింగ్ విమానం ఆలస్యంగా రావడం, విమాన ట్రాఫిక్ రద్దీ , సిబ్బంది తమ డ్యూటీ సమయ పరిమితులను మించడం వంటి అనేక కారణాల వల్ల ముంబై నుండి విమానం ప్రారంభంలో ఆలస్యమైందని ఇండిగో ప్రతినిధి తెలిపారు. వేచి ఉండే సమయంలో విమానంలోని ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించారనీ, వారిని క్రమశిక్షణ లేనివారిగా ప్రకటించామని విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వివాదంతో ప్రోటోకాల్ ప్రకారం, వారిని విమానం నుండి దించి భద్రతా సంస్థలకు అప్పగించే క్రమంలో విమానం బయలుదేరడం మరింత ఆలస్య మైందని వివరించింది. గతంలో వెయిటింగ్ పీరియడ్‌లో ప్రయాణికులకు లంచ్, డ్రింక్స్‌లాంటివి అందించామని తెలిపింది. అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందిండచమే లక్ష్యమని, వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది.
ఇదీ చదవండి: 5,200 ఏళ్ల నాటి పడవ గుర్తింపు, సూపర్ టెక్నాలజీ


