breaking news
Choas
-
తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత
ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్ కాల్పుల మోతతో అట్టుడికింది. బుధవారం ఉదయం హెరాత్‌లోని జిబ్రిల్ ప్రాంతంలో, సరైన బురఖా ధరించలేదనే ఆరోపణలతో మహిళలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులపై తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, దాదాపు ముప్పై మంది గాయపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హెరాత్‌లోని జిబ్రిల్ వాసులు మహిళల అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వీరిని అణచి వేసేందుకు తాలిబాన్ ఫైటర్లు తూపాకీలను నేరుగా ఛాతీపై గురిపెట్టి కాల్పులు జరిపారని, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మానవ హక్కుల సంఘాలు, తాలిబాన్ వ్యతిరేక రాజకీయ నేతలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నగరంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మహిళల రాకపోకలపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ మహిళలను బయటకు వెళ్లనివ్వవద్దని, ఒకవేళ వారిని బంధిస్తే విడిపించడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేమని హెరాత్‌లోని కొందరు మసీదు ఇమామ్‌లు నిన్న ప్రజలను హెచ్చరించారు.తాలిబాన్లు నిరసనకారుల ఛాతీపై కూడా కాల్పులు జరిపారనీ, కొందరు యువకులు కిందపడి రక్తం ఓడుతుండటం చూశానని స్థానికులు ఒకరు తెలిపారు. మహిళలు నినాదాలు చేస్తుండగా, తాలిబాన్లు కాల్పులు జరుపుతున్నారు. తాలిబాన్ల నిబంధనల ప్రకారం బురఖా/హిజాబ్ ధరించని మహిళలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారు భారీగా కాల్పులు జరుపుతున్నప్పటికీ, ప్రజలు "విద్య, ఉపాధి, స్వేచ్ఛ" అంటూ నినాదాలు చేస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది.మరోవైపు తాలిబాన్ల అరెస్టులు, అణచివేతకు భయపడి చాలా మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు కాకుండా ఇళ్లకే తరలించారని నిరసనకారులు చెబుతున్నారు. దీనివల్ల గాయపడిన వారికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా అందలేదు. తాలిబాన్లు ఆసుపత్రుల్లో కూడా నిఘా ఉంచి, గాయపడిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నారని కొందరు ధృవీకరించారు.🇦🇫 Taliban opens fire on civilians protesting morality police in Herat, Afghanistan, residents hit streets demanding end to burqa and chador rules @visegrad24 pic.twitter.com/34ik8JLDAq— U.S.A.I. 🇺🇸 (@researchUSAI) June 9, 2026 జిబ్రిల్కు అదనపు బలగాల తరలింపుజిబ్రిల్లో ప్రజా నిరసనలను అణచివేసిన తర్వాత, తాలిబాన్లు వందలాది మంది కొత్త ఫైటర్లను ఆ ప్రాంతానికి పంపారు. నగరంలోని అన్ని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విడుదలైన వీడియోల ప్రకారం, హెరాత్ నగరం పూర్తిగా సైనిక జోన్లా మారిపోయింది. రోడ్లపై, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫైటర్లను మోహరించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న తాలిబాన్లు కూడా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం.అయితే షల్ మీడియాలో ఈ నిరసనల గురించి సోషల్ మీడియా ద్వారా ఉప్పందడంతో ఉదయం నుంచే వారు సాధారణ దుస్తుల్లో భారీగా మోహరించారు. ప్రజలు గుమిగూడటం ప్రారంభించగానే అన్ని వైపుల నుండి ఆయుధాలతో దాడి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి కూడా నిఘాపెట్టి క్షతగాత్రులకు చికిత్స అందకుండా అడ్డుకున్నారు.మానవ హక్కుల సంఘాల స్పందనదీనిపై అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హెరాత్‌లో ప్రజా నిరసనల అణచివేతపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాలిబాన్ల ఆంక్షలు అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై కాల్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలిపే నిరసనకారులపై చట్టవిరుద్ధంగా బలాన్ని ఉపయోగించడాన్ని వెంటనే నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని కోరింది. మహిళలు, బాలికల హక్కులైన స్వేచ్ఛగా తిరిగే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేసింది,హెరాత్‌లో ప్రజా నిరసనలపై తాలిబాన్ల అణచివేతకు ప్రతిస్పందిస్తూ, మాజీ ఆఫ్ఘన్ ప్రభుత్వ విదేశాంగ సలహాదారు రంగిన్ దాద్ఫర్ స్పాంటా ఎక్స్‌లో స్పందించారు. "ఈ అణచివేత, చరిత్రలో సాగుతున్న ఈ పాలనను ప్రజలే స్వయంగా ముగించాలి" అని పిలుపునిచ్చారు.మరోవైపు, హ్యూమన్ రైట్స్ వాచ్‌కి చెందిన ఆఫ్ఘనిస్తాన్ పరిశోధకురాలు ఫెరెష్తే అబ్బాసి స్పందిస్తూ, హెరాత్ ప్రావిన్స్ నుండి తమకు "ఆందోళన కరమైన నివేదికలు" అందాయని చెప్పారు. తాలిబాన్లు నిరసనకారులపై ఎలాంటి బలాన్ని ప్రయోగించకుండా వెంటనే వైదొలగాలని, శాంతియుత నిరసనల కోసం నిర్బంధించిన వారిని విడుదల చేయాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. హింస లేదా బెదిరింపులు లేకుండా శాంతియుత నిరసనలు జరుపుకోవడానికి నిరసనకారులను అనుమతించాలని ఆమె పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్యసమితి (UN) ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్, ఈ అణచివేతను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. నిరసనకారులపై జరిగిన హింసకు పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా 2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, తాలిబన్లు మహిళలు, బాలికలపై విస్తృతమైన ఆంక్షలు విధించారు. వీటిలో సెకండరీ, విశ్వవిద్యాలయ విద్యపై నిషేధం, ఉపాధిపై పరిమితులు, దుస్తులు, కదలికలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి.Today, Afghan human rights defenders protested outside the UN office in Tehran in solidarity with the women of Herat and across Afghanistan. They called on the UN and the international community to end their silence and take action for Afghan women’s rights.#HeratAfghanProtest pic.twitter.com/DJcjvDNBUi— Jahanzib Wesa (@jahanzibwesa) June 11, 2026 -
మరో నిర్వాకం : అటు ఇండిగో, ఇటు ప్రయాణికులు, వైరల్ వీడియో
పైలట్ల కొరత, విమానాల రద్దు, పైలట్ల పనిగంటల తదితర అంశాలపై ఇప్పటికే చాలా విమర్శలెదుర్కొన్న ఇండిగో మరో వివాదంలో చిక్కుకుంది. డ్యూటీ సమయం ముగిసిన తర్వాత కూడా మరో విమానాన్ని నడపమని సంస్థ కోరడం, దీనికి పైలట్ నిరాకరించడంతో గందరగోళం నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముంబై నుండి థాయ్‌లాండ్‌లోని క్రాబీకి వెళ్లే ఇండిగో విమానానికి సంబంధించి గురువారం నాడు ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటనపై ఇండిగో స్పందన ఎలా ఉందంటే..ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఉదయం 4:05 గంటలకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం, 6E 1085, మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. ఉదయం 10 గంటలకు క్రాబీలో ల్యాండ్ కావాల్సిన విమానం, ఫ్లైట్రాడార్24 ప్రకారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి చేరుకుంది.New:-Pandemonium in @IndiGo6E flight from Mumbai to Krabi -Passengers wanted to beat pilot-Who is said to have refused to operate flight as he was breaching his duty time & had told airline in advance-But flight was boarded & passengers were stuck inside for 3 hours✈️ pic.twitter.com/vAYWjCBHov— Tarun Shukla (@shukla_tarun) January 15, 2026విమానంలోని ప్రయాణికులకు, క్యాబిన్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. తన డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి పైలట్ విమానాన్ని నడపడానికి నిరాకరించాడని, ఈ కారణంతా తాము మూడు గంటలు పాటు ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. విమానం ఆలస్యం కారణంగా తమకు జరిగిన అసౌకర్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్లాన్ల పరిస్థితి ఏంటి అని ఒక ప్రయాణికుడు మండిపడ్డారు. మరి కొంతమంది తీవ్ర ఆగ్రహంతో దుర్బాషకు దిగారు. ముంబై-క్రాబీ విమానంలో జరిగినట్లు నివేదించబడిన ఈ సంఘటనను వీడియో తీసి రచయిత తరుణ్ శుక్లా ఎక్స్‌లో షేర్ చేశారు. దీని ప్రకారం ‘‘ఇండిగో హాయ్ హాయ్" అని నినాదాలు చేయడం చూడవచ్చు. ఒక మహిళ "ఎలుకలా ఎందుకు దాక్కున్నాడు? బ్లడీ ఇడియట్" అని అరవడం, మరో ప్రయాణికుడు విమానం ఎగ్జిట్ డోర్‌ను తన్నడం కూడా కనిపించింది.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచిఇండిగో స్పందనవిమానం ఆలస్యంపై ఇండిగో స్పందించింది. ఇన్కమింగ్ విమానం ఆలస్యంగా రావడం, విమాన ట్రాఫిక్ రద్దీ , సిబ్బంది తమ డ్యూటీ సమయ పరిమితులను మించడం వంటి అనేక కారణాల వల్ల ముంబై నుండి విమానం ప్రారంభంలో ఆలస్యమైందని ఇండిగో ప్రతినిధి తెలిపారు. వేచి ఉండే సమయంలో విమానంలోని ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించారనీ, వారిని క్రమశిక్షణ లేనివారిగా ప్రకటించామని విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ వివాదంతో ప్రోటోకాల్ ప్రకారం, వారిని విమానం నుండి దించి భద్రతా సంస్థలకు అప్పగించే క్రమంలో విమానం బయలుదేరడం మరింత ఆలస్య మైందని వివరించింది. గతంలో వెయిటింగ్ పీరియడ్‌లో ప్రయాణికులకు లంచ్, డ్రింక్స్లాంటివి అందించామని తెలిపింది. అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందిండచమే లక్ష్యమని, వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. ఇదీ చదవండి: 5,200 ఏళ్ల నాటి పడవ గుర్తింపు, సూపర్ టెక్నాలజీ -
వేలాదిగా ఎయిర్‌పోర్ట్‌కు జనం, విరుచుకుపడిన తాలిబన్లు
కాబూల్: అఫ్గన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తరువాత దేశంలో నిరసనల సెగ ప్రారంభమైంది. తాజాగా కాబూల్ విమానాశ్రయం వెలుపల గందరగోళం చెలరేగింది. దేశం నుండి పారిపోవడానికి వేలాది మంది ప్రజలు విమానాశ్రయానికి తరలివచ్చారు. వీరిపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. రైఫిళ్లతోవారినిచితక బాదారు. తాలిబన్ల దాడి,భారీగా ఏర్పాటు చేసిన ముళ్ల కంచె, జనం హాహాకారాలతో ప్రతిధ్వనిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Afghanistan: తాలిబన్లకు మరో షాక్! సాయం నిలిపివేత) విమానాశ్రయం లోపల యుఎస్ మిలిటరీ నియంత్రణ ఏర్పాటు చేసినప్పటికీ, సైనిక విమానాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ బుధవారం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెల్లువలా వస్తున్న జనాలను అదుపు చేసేందుకు తాలిబ్లను విరుచుకుపడుతున్నారు. కాబుల్ విమానాశ్రయం వెలుపల గొలుసులు, కొరడాలు, ఇతర పదునైన ఆయుధాలతో ప్రజలను తీవ్రంగా కొడుతున్నారని సోషల్ మీడియా హోరెత్తి పోతోంది. ఈ ఘటనలో ఒక మహిళ, బాలుడు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలు సహాయం కోసం అర్థిస్తూ హాహాకారాలు చేస్తున్నారు. మమ్మల్ని పోనివ్వండి.. లేదంటే తాలిబన్లు మా తలలు నరుకుతారు..గేట్లు తీయమంటూ వేడుకుంటున్నవీడియో వైరల్ అవుతోంది అమెరికాలో అత్యంత హృదయం లేని, భయంకరమైన మనిషి జోబైడెన్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విమానాశ్రయ గేట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది గాయపడ్డారని విమానాశ్రయంలోని నాటో సెక్యూరిటీ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా) At #kabulairport gates where the US forces controlling, people crying and begging US forces to allow them to pass the gates otherwise the Taliban will come and will behead them. pic.twitter.com/wzxXJf2ngL — Natiq Malikzada (@natiqmalikzada) August 18, 2021 Scenes of total chaos at #kabulairport today. pic.twitter.com/A2ESgEfxNW — Matt Zeller (@mattczeller) August 18, 2021 -
చీటికి మాటికి ఇంటర్నెట్ నిలిపేస్తే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసుల్లో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో అల్లర్లు జరుగకుండా నివారించేందుకు ముందు జాగ్రత్తగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అన్ని ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. అంతకు మూడు రోజుల ముందు ఆయన్ని దోషిగా నిర్ధారించినప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఇప్పుడు ఇరు రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించవచ్చు. కానీ, ఈ మధ్య శాంతి భద్రతల పరిరక్షణ పేరిట చీటికి మాటికి టెలికాం సర్వీసులను, ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేస్తున్నాయి. డిజిటల్ లావా దేవీల రంగంలో భారత్ లాంటి దేశాలు తప్పనిసరై ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలో పదే పదే ఈ సర్వీసులకు విఘాతం కల్పించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ 2017 సంవత్సరంలో ఇప్పటి వరకు 40 సార్లు ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వ అధికారులు నిలిపివేశారని ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేతను పర్యవేక్షించే సంస్థ ‘సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్’ వెల్లడించింది. ఇంకా ఈ ఏడాదిలో నాలుగు నెలల కాలం మిగిలి ఉండగానే, అంటే ఎనిమిది నెలల కాలంలోనే 40 సార్లు ఈ సర్వీసులను నిలిపివేయడం మామూలు విషయం కాదు. అంతకుముందు రెండేళ్లలో నిలిపివేసిన దానికన్నా ఈ సంఖ్య ఎక్కువ. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీలసుల నిలిపివేత తగ్గాల్సిందిపోయి పెరగడం విచిత్రం. గతంలో కేంద్ర, రాష్ట్ర హోం కార్యదర్శిలకు మాత్రమే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసే అధికారాన్ని అప్పగించారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఆ అధికారాన్ని ఇవ్వలేదు. అత్యవసర సమయాల్లో ఉన్నతాధికారులు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన సందర్భాల్లో వారి నిర్ణయాన్ని 24 గంటల్లోగా సమీక్షించాలి. కారణం ఏమిటో తెలియదుగానీ అత్యవసర సమయాల్లో ఈ సర్వీసులను నిలిపివేసే అధికారాలను జాయింట్ సెక్రటరీ, ఆ పై స్థాయి అధికారులందరికి కట్టబెడుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆగస్టు ఏడవ తేదీన ఓ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటి నుంచి దేశంలో టెలికామ్ నియంత్రణ చట్టం కింద టెలికామ్, ఇంటర్నెట్ సర్వీసులను ఎప్పుడు పడితే అప్పుడు నిలిపివేస్తున్నారు. ఈ విధానాన్ని తక్షణమే మార్చాలి. ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేయడాన్ని మరింత కఠినతరం చేస్తూ నిబంధనలను తీసుకురావాలి. అవసరమైతే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయడాన్ని ప్రాథమిక హక్కుల భంగం కింద పౌరులు కేసులువేసి వాదించే పరిస్థితి ఉండాలని పలు ప్రజా సంఘాలు భావిస్తున్నాయి.


