ఈజిప్టు పిరమిడ్ల కంటే పురాతనమైన పడవను అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విస్కాన్సిన్‌లోని పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన ఈ పడవను గుర్తించారు. ఇక్కడ మొత్తం 16 పురాతన బోట్లను గుర్తించడం విశేషం.
న్యూస్‌వీక్ నివేదిక ప్రకారం ఉత్తర అమెరికాలోని విస్కాన్సిన్ హిస్టారికల్ సొసైటీ (WHS) పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన పడవను కనుగొన్నారు. మెన్డోటా సరస్సులో మొత్తం 16 పురాతన బోలు చెక్క పడవలను పరిశోధకులు గుర్తించారు. ఈ పడవలలో పురాతనమైనది ఈజిప్టులోని గిజా పిరమిడ్ ఉనికిలో ఉండటానికి ముందు కాలం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో అనుకున్న దానికంటే చాలా ముందుగానే జీవించి వ్యవస్థీకృత సమాజాలుగా అభివృద్ధి చెందారని వెల్లడిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి
సహజంగా రేడియోధార్మిక మూలకం ఎంతవరకు క్షీణించిందో చూడటానికి కలపను పరీక్షించినప్పుడు, ఈ పడవలు 1300AD , 3000BC మధ్య నిర్మించబడ్డాయని తేలింది. మెండోటా సరస్సు కింద కనుగొనబడిన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలు ఉత్తర అమెరికాలో ప్రారంభ మానవ జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.వేల ఏళ్లకుముందే ప్రపంచవ్యాప్తంగా మానవ పడవ తయారీ నైపుణ్యాలు అభివృద్ధి గురించి వివరించింది. ఈ పడవలు 5,200 సంవత్సరాల క్రితం గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ప్రజలు ఎలా ప్రయాణించారు, ఎలా నివసించారో ఇది వెల్లడిస్తుంది. ముఖ్యంగా ఆ కాలంలోనే ఇక్కడి ప్రజలు బలమైన, మన్నికైన ఓడలను నిర్మించేంత అవగాహన , సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం విశేషం.
2021లో శాస్త్రవేత్తలు 1,200 సంవత్సరాల నాటి మొదటి పడవను కనుగొన్నారు. 3,000 సంవత్సరాల నాటి మరో పడవను 2022లో కనుగొన్నారు. ఆ తర్వాత మరో పద్నాలుగు పడవలు గుర్తించారు. వాటిలో ఆరు 2025లో కనుగొనబడ్డాయి. 16 పడవలలో రెండు మాత్రమే నీటి నుండి బయటకు తీశారు. వీటిలో దాదాపు 3,000 సంవత్సరాల నాటి 14 అడుగుల పొడవైన పడవ కూడా ఉంది. ఇవి ఎక్కువగా ఎరుపు , తెలుపు ఓక్ వంటి గట్టి చెక్కలతో తయారు చేసినవి. పడవల పైన రాళ్లను జాగ్రత్తగా ఉంచారట. శీతాకాలంలో పడవ తయారీకి ఉపయోగించే చెక్క వంకర పోకుండా చూసుకోవడానికి ఈజాగ్రత్త తీసుకుని ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. అలాగే WHS బృందం ఓక్‌ను ఉపయోగించడం అసాధారణ మని పేర్కొంది. సాధారణంగా చెట్టుకు ఉండే ఓపెన్ పోర్స్ నీటిని గ్రహిస్తాయి. ఇవి పడవలు మునిగిపోకుండా తేలియాడేలా చేస్తుంది.
ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి


