దుబాయి నుంచి అక్రమంగా తరలించిన రూ.9 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి, చెన్నై: దుబాయి నుంచి అక్రమంగా తరలించిన రూ.9 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు దుబాయి నుంచి రానున్న ఎయిర్ ఇండియా విమానంలో భారీ ఎత్తున బంగారం తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు అనుమానంతో ఐదుగురిని విచారించగా విమానంలోని టాయిలెట్‌లో ఐదు పార్సిళ్లలో దాచివుంచిన రూ.9 కోట్ల విలువైన 30 కిలోల బంగారం దొరికింది. దీంతో వారిని అరెస్టు చేసి విచారణ సాగిస్తున్నారు.