ఎనిమిది కిలోల బంగారం పట్టివేత | Eight kgs of gold recovered Chennai | Sakshi
Sakshi News home page

ఎనిమిది కిలోల బంగారం పట్టివేత

Nov 24 2015 9:58 AM | Updated on Sep 3 2017 12:57 PM

చెన్నై విమానాశ్రయంలో మంగళవారం ఎనిమిది కిలోల బంగారం పట్టుబడింది.

చెన్నై: చెన్నై విమానాశ్రయంలో మంగళవారం ఎనిమిది కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ రెండున్నర కోట్ల రూపాయలుంటుందని  ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.  పోలీసుల తనిఖీల్లో భాగంగా ముందు  రెండు బ్యాగుల్లో  అక్రమంగా  రవాణా చేస్తున్న అయిదున్నర కిలోల  బంగారాన్ని  స్వాధీనం చేసుకున్నారు. 

 

ఆ తర్వాత బ్యాంకాక్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు  తన బ్యాగ్ లో  ఉన్న 2.5 కిలోల బంగారం తనది కాదని పోలీసులకు  ఫిర్యాదు చేశాడు.  దీంతో మొత్తం 8  కిలోల  గోల్డ్ ను  సీజ్ చేసిన అధికారులు... సదరు ప్రయాణికుడ్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని  బ్యాగ్ లోకి బంగారం ఎలా వచ్చిందనే విషయాన్ని ఆరా తీస్తున్నామని,   విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement