పాదరక్షల్లో బంగారం తరలింపు

Footwears in gold moving in meenambakkam - Sakshi

టీ.నగర్‌(చెన్నై): చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.33 లక్షల విలువగల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన అస్మద్‌ఖాన్‌ (34) తాను ధరించిన పాదరక్షల అడుగు భాగంలో బంగారాన్ని దాచి తీసుకువస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేరళకు చెందిన ప్రకాశ్‌ (32) సూట్‌కేసులో దాచి తీసుకువస్తుండగా పట్టుకున్నారు. కాగా, సింగపూర్‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన చెన్నైకి చెందిన మహ్మద్‌ ఆసిఫ్‌ అనే వ్యక్తి దగ్గర కస్టమ్స్‌ అధికారులు రూ.5 లక్షల విలువైన అబుదాబి దేశ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అతను తన లోదుస్తుల్లో ఆ కరెన్సీని దాచుకుని వచ్చి తనిఖీల్లో పట్టుబడ్డాడు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top