ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. #MumbaiRains
ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు రుతుపవనాల రాక ఉపశమనం కలిగించినప్పటికీ, ఒక్కసారిగా కురిసిన కుండపోత వానతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పశ్చిమ శివారు ప్రాంతాల్లో అత్యధికంగా 190 మిమీ, తూర్పు శివారు ప్రాంతాల్లో 154 మిమీ వర్షపాతం నమోదు కాగా, నగరవ్యాప్తంగా సగటున 184 మిమీ మేర భారీ వర్షం కురిసింది.


