కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్ | Minister Konda Surekha Former Osd Sumanth Driver Arrested | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

Aug 23 2026 2:06 PM | Updated on Aug 23 2026 2:06 PM

Minister Konda Surekha Former Osd Sumanth Driver Arrested

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి.. ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మేడ్చల్‌ మల్కాజగిరి జిల్లా మేడిపల్లిలో సుమంత్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాడ్లుతో దాడి చేసినట్లు వ్యాపారి గొంగడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. సుమంత్‌పై 109 సెక్షన్‌ కింద కేసు నమోదు అయ్యింది.

అయితే మేడిపల్లిలో పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌(నేరం ఎక్కడ జరిగినా, ఏ ప్రాంతానికి చెందినదైనా సరే... బాధితులు తమకు దగ్గరలోని ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించుకోవడం) నమోదు చేయడంతో ఇప్పుడు ఆ కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయ్యింది. సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement