ఏఐనే కీలకం అంటున్న ‘స్మార్ట్’ యూజర్లు
రూ.15 వేల లోపు ఫోన్లకు డిమాండ్ 7 శాతమే..
అమెజాన్ డాట్‌ఇన్ బెస్ట్ ఇన్‌టెక్ సర్వేలో వెల్లడి
నగరం సహా పలుచోట్ల అధ్యయనం
ఏఐ ఫీచర్లు ఇప్పుడు 82% స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్, బ్యాటరీ జీవిత కాలం, కెమెరా సామర్థ్యం వంటివి వరుసగా నిలిచాయి. స్మార్ట్ ఫోన్ ఎంపికలో వినియోగదారులపై ప్రభావం చూపుతున్న అంశాలపై అధ్యయనాన్ని బెస్ట్ ఇన్‌టెక్ సర్వే పేరిట అమెజాన్ డాట్ ఇన్ నిర్వహించింది.
నగరంతో పాటు పలు చిన్న, మధ్య తరహా పట్టణాల వ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాల ప్రకారం.. 87% మంది. పెర్ఫార్మెన్స్ వేగం 79% మంది బ్యాటరీ జీవిత కాలం 77% మంది నాణ్యతలను కోరుకుంటున్నారని ఏఐ రాకతో వినియోగదారుల ప్రాధాన్యతల్లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమెజాన్ ఇండియా, కంజ్యూమర్ ఎల్రక్టానిక్స్, డైరెక్టర్, జేబా ఖాన్ అభిప్రాయపడ్డారు. - సాక్షి, హైదరాబాద్
రేటింగ్స్‌కే ప్రథమ ప్రాధాన్యం..
దిగువ మధ్యతరగతి, పేద జనాభా ఎక్కువగా ఉండే మన దేశంలో రూ.15వేల లోపు ధర కలిగిన ఫోన్లకు 7 శాతం మాత్రమే ఎంచుకుంటున్నారని అధ్యయనం వెల్లడించడం విశేషం. అత్యధిక డిమాండ్ (42 శాతం మంది) రూ.25 వేల నుంచి రూ.50 వేల మధ్య ధర కలిగిన ఫోన్లకు ఉందని, రూ.75 వేల లోపు ఖరీదు చేసే ఫోన్లను 15 శాతం మంది, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్లను 17 శాతం మంది ఎంచుకుంటున్నారు. రూ.15వేల నుంచి రూ.25 వేల మధ్య ధర కలిగిన ఫోన్లను 19 శాతం మంది ఓటేశారు.
ఫోన్ వినియోగదారుల్లో 54శాతం మంది తమ ఫోన్లను రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. వచ్చే మూణ్నెళ్లలో ఫోన్ మారుస్తామని 48 శాతం మంది చెప్పారు. ఫోన్ల ఎంపికలో డిస్కౌంట్ల కంటే రేటింగ్స్‌కే వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కొనుగోలు చేసేటప్పుడు రేటింగ్స్‌కి మొదటి ప్రాధాన్యమిస్తామని 47శాతం మంది చెప్పగా, డిస్కౌంట్లు, బెస్ట్ డీల్స్‌కే ఓటేస్తామని 35శాతం మంది వెల్లడించారు.


