చేతికి గాయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! లేదంటే? | National Hand Surgery Day Hand Injuries First Aid Tips | Sakshi
Sakshi News home page

చేతికి గాయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! లేదంటే?

Aug 23 2026 8:21 AM | Updated on Aug 23 2026 8:21 AM

National Hand Surgery Day Hand Injuries First Aid Tips

హెల్త్‌

‘నేషనల్‌ హ్యాండ్‌ సర్జరీ డే’

మానవ నాగరికతా వికాసంలో చేతిది చాలా కీలక భూమిక. చెయ్యి, కన్ను ఈ రెండింటి సమన్వయంతోనే  అద్భుతాలన్నీ సాకాఅవుతున్నాయి.  ఇంతటి కీలకమైన చెయ్యి గురించి అవగాహన అవసరం. నేడు (ఆగష్టు 23న) ‘నేషనల్‌ హ్యాండ్‌ సర్జరీ డే’ సందర్భంగా చేతికి అయ్యే గాయాలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...

చేతికి అయ్యే గాయాల్లో... కోసుకుపోవడం, విరగడం (ఫ్రాక్చర్స్‌), డిస్‌లొకేషన్స్, సాఫ్ట్‌ టిష్యూ ఇంజరీస్, తెగిపోవడం, ఇన్ఫెక్షన్స్‌, కాలడం, పడిపోవడం వల్ల చేతిపై తీవ్ర ఒత్తిడి పడి అయ్యే హై–ప్రెజర్‌ ఇంజరీస్‌ ప్రధానమైనవి.

చేయి కోసుకుపోయినప్పుడు...
పదునైన వస్తువులతో చెయ్యి లోతుగా కోసుకోవడం వల్ల చర్మంతో ΄ాటు టెండన్లు, నరాలు, ధమనులు, సిరలు దెబ్బతినవచ్చు. నొప్పి, రక్తస్రావం, తిమ్మిరి, స్పర్శ తగ్గడం, వేళ్ల కదలిక తగ్గడం, చేతి బలం తగ్గడం, చర్మం ΄ాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే గాయం లోతుగా అయినట్లు భావించాలి. పైపైన కోసుకుపోయినప్పుడు ఆ గాయానికి కుట్లు వేయడం సరిపోవచ్చు. అయితే.. నర్వ్‌ ఇంజరీ, రక్తనాళం  ఇంజరీ లేదా టెండన్‌ ప్రభావితమైనప్పుడు ప్రత్యేక శస్త్రచికిత్స అవసరం.

ఫ్రాక్చర్‌.. డిస్‌లొకేషన్‌లో... 
చేతి ఎముకలు విరగడం లేదా చేతి ఎముకలూ, జాయింట్స్‌ డిస్‌లోకేషన్స్‌ వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, రంగు మారడం, చేతి ఆకృతిలో మార్పు, కదలిక తగ్గడం, తిమ్మిరి ఏర్పడవచ్చు. ఎక్స్‌రే ద్వారా ఫ్రాక్చర్, డిస్‌లోకేష¯Œ ను నిర్ధారణ చేస్తారు. గాయాన్ని బట్టి ΄్లాస్టర్‌ వేయడం, కట్టు కట్టడం స్పి›్లంటింగ్, ఇంటర్నల్‌ ఫిక్సేషన్‌ వంటి చికిత్సలు అవసరమవుతాయి.

వేళ్లు తెగిపోతే... 
ఏవైనా ప్రమాదాల్లో చేతివేళ్లు పూర్తిగా తెగిపోవడాన్ని యాంప్యుటేషన్‌ అంటారు. కొన్ని కేసుల్లో రీ΄్లాంటేషన్‌ మైక్రోసర్జరీ ద్వారా తెగిపోయిన భాగాన్ని తిరిగి అతికించే అవకాశముంటుంది. ఇలా తెగినప్పుడు పూర్తిగా విడివడిన ఆ భాగాన్ని నేరుగా మంచు (ఐస్‌)పై ఉంచకూడదు. ఆ భాగాన్ని శుభ్రమైన గాజుగుడ్డలో చుట్టి, నీరుగానీ, మంచుగానీ లేదా తడిగానీ నేరుగా తగలకుండా ΄్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి, దాన్ని ఆసుపత్రికి తరలించాలి.

ఇన్ఫెక్షన్‌.. చిన్న గాయంతోనూ ముప్పే
చిన్న కోత లేదా గాయం ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి చేతిలో ఇన్ఫెక్షన్‌ ఏర్పడవచ్చు. నొప్పి, గాయం చుట్టూ వేడి, ఎర్రదనం, వాపు, చీము, చేతి కదలిక తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తీవ్రతను బట్టి చికిత్స
వేడిపదార్థాలూ, ఏవైనా రసాయనాలు లేదా విద్యుదాఘాతం వల్ల చేతికి కాలిన గాయాలు (బర్న్స్‌) కావచ్చు. కాలిన గాయాన్ని చల్లటి నీటితో కలగాలి. నేరుగా ఐస్‌ పెట్టకూడదు. రసాయనాలతో కాలిన గాయాల్లో ఎక్కువ నీటితో కడగాలి.

ముఖ్యంగా ఐదు పరీక్షలు... 
చేతికైన గాయాన్ని ఐదు అంశాల్లో పరీక్ష చేస్తారు. అవి... 
1. బటయకు కనిపించే గాయం పరీక్ష
2. నరాల పరీక్ష
3. వాస్క్యులర్‌ పరీక్ష
4. కండరాలు–టెండన్ల పరీక్ష
5. ఎముకలు–జాయింట్ల పరీక్ష. ఈ అంశాల్లోతేడాలేమైనా ఉన్నాయేమో చూస్తారు.

ఎక్స్‌రే... ఇతర పరీక్షలు
ముందుగా గాయాన్నినేరుగా పరిశీలించాక అవసరాన్ని బట్టి ఎక్స్‌రే తీస్తారు. రక్తనాళాలకు గాయాలయ్యాయా వాటి పరిస్థితి ఏమిటన్నది తెలుసుకోడానికి డాప్లర్‌ లేదా ఇతర వాస్క్యులర్‌ ఇమేజింగ్‌ పరీక్షలు అవసరం కావచ్చు.

ప్రథమ చికిత్సలో ఇవీ జాగ్రత్తలు...
చేతికి గాయమైనప్పుడు శుభ్రమైన గాజుగుడ్డ లేదా మెత్తటి బట్టతో మెల్లగా కొద్ది΄ాటి ఒత్తిడి పెడుతూ రక్తస్రావాన్ని అరికట్టాలి. లోపలికి చొచ్చుకుపోయిన పెద్ద వస్తువులను ఎవరికి వారు తొలగించకూడదు. ఎముక విరగడం లేదా ఎముక /కీలు పక్కకు తొలగడం  వంటి కేసుల్లో చేతిని కదలకుండా గుడ్డతోగానీ లేదా స్క్రేప్‌బ్యాండ్‌తో చుట్టాలి.

ఎముక బయటకు కనిపించే ఓపెన్‌ ఫ్రాక్చర్‌లో ఇలా బయటకు కనిపించే ఎముకను తిరిగి లోపలికి నెట్టకుండా శుభ్రమైన గాజుగుడ్డను కప్పి బాధితుడిని ఆసుపత్రికి తరలించాలి. చెయ్యి తాలూకు అవయవమేదైనా పూర్తిగా తెగిపోయినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు చేతిని పైకి తిప్పి ఉంచాలి. తెగిపోయిన భాగాన్ని శుభ్రమైన గాజుగుడ్డలో చుట్టి చల్లని పరిస్థితుల్లో భద్రపరచాలి. నేరుగా మంచు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.

చివరగా...
తీవ్రమైన రక్తస్రావం, తిమ్మిరి లేదా స్పర్శ కోల్పోవడం, వేళ్లు కదలకపోవడం, బలం తగ్గడం, నొప్పి, వేళ్లు లేదా చేతి భాగం తెగిపోవడం, ఇన్ఫెక్షన్‌ లక్షణాలు ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా అత్యవసరంగా డాక్టర్‌ లేదా హ్యాండ్‌ సర్జన్‌కు చూపించి తక్షణం వైద్యచికిత్స తీసుకోవడం ముఖ్యం.

- డాక్టర్‌ గోపీనాథ్‌ భండారి, సీనియర్‌ కన్సల్టెంట్‌, మైక్రో హ్యాండ్‌ సర్జన్‌

  • నిర్వహణ: యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement