breaking news
add film shooting
-
50 సెకన్ల ప్రకటన.. అదిరిపోయే రేంజ్లో 'నయనతార' రెమ్యునరేషన్
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది పాత సామెతే అయినా ఎవరైనా ఎప్పుడూ అమలు పరచేదే. ఇందుకు సంచలన తార నయనతార అతీతం కాదు. ఈమె చాలా కష్టపడి కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన నటి. కేరళలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నటనపై ఆసక్తితో పలు అవమానాలు, అవరోధాలు ఎదుర్కొని కథానాయకిగా నిరూపించుకున్నారు. అయితే దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తానని బహుశ ఆమె కూడా ఊహించి ఉండరు. కోలీవుడ్‌లో అయ్యా చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న నయనతార ఆ తరువాత రజనీకాంత్‌కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా వెలిగపోతున్నారు. ఈమె మొదటి నుంచి సంచనాలకు చిరునామా అని చెప్పవచ్చు. మొదట్లో ప్రేమ, ఆ తరువాత పెళ్లి, ఆపై సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి, నిర్మాత ఇలా ఒక్కో ఘట్టంలోనూ వివాదాలు, విమర్శలను తొక్కుకుంటూ తన స్థాయిని నిలబెట్టుకుంటున్న నయన్ ఇప్పటికీ స్టార్ హీరోలతో జత కడుతూ బిజీగా ఉన్నారు. ఈ భామ చిత్రానికి రూ.10 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా 50 సెకన్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సాయాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంటే ఈమె ఒక సెకన్ పారితోషకం అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. అయితే, ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిందని సమాచారం. నయనతార సాధారణంగా యాడ్స్ చేయడం చాలా అరుదు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్ చేస్తారు. ఇది చూసి ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్‌కు అంత రెమ్యునరేషన్ తీసుకోరు. నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్‌కు తగ్గట్టే దూసుకుపోతున్నారు. ఇకపోతే కోలీవుడ్‌లో ఇటీవల నయన చిత్రాలేమీ విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం దగ్గలేదనడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది తెరపైకి రావడానికి ఆ చిత్రం సిద్ధం అవుతోంది. -
ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..
Rashmika Mandanna Shoot With Tiger Shroff: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నేషనల్ క్రష్. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్‌బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల రష్మిక మందన్నాపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అందులో ఒక రూమర్ నిజమే అని తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. రష్మిక మందన్నా, బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి ఒక యాడ్‌లో కలిసి నటించారు. దీనికి సంబంధించిన బూమరాంగ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది రష్మిక. ఈ వీడియో పోస్ట్ చేస్తూ 'ఆ రూమర్లు నిజమే.. చాలా నవ్వోస్తోంది. నేను, టైగర్ ష్రాఫ్ ఒక యాడ్ కోసం కలిసి నటించాం. టైగర్ ష్రాఫ్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. ఈ యాడ్ కోసం ఎదురుచూస్తున్నాను' అని రాసుకొచ్చింది. ఈ స్టోరీని టైగర్ ష్రాఫ్ షేర్ చేస్తూ 'షూట్ చేయడం సరదాగా ఉంది. నువ్ ఎప్పటిలాగే అదరగొట్టావ్' అని క్యాప్షన్ ఇచ్చాడు. సో.. రష్మిక నిజమని చెప్పిన రూమర్ ఇదన్నమాట. చదవండి: అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ View this post on Instagram A post shared by 🆃🅸🅶🅴🆁🆂🅷🆁🅾🅵🅵 (@tigershroff_fp__) -
ఆటో డ్రైవర్‌గా మారిన స్టార్ హీరో.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ శింబు గతేడాది మానాడు హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. ప్రస్తుతం శింబు గౌతం వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో ‘వెందు తణిందదు కాడు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు మరో రెండు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శింబు ఆటోడ్రైవర్‌గా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో శింబు సినిమాలో ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారంటూ ఆయన ఫ్యాన్స్ వరుస ట్వీట్స్ చేసి ట్రెండింగ్ చేశారు. కానీ నిజానికి ఇది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం శింబు ఇలా ఆటో డ్రైవర్‌గా నటించారు అని ఆయన సన్నిహితులు వివరణ ఇవ్వడంతో రూమర్స్‌కి చెక్ పడినట్లయ్యింది. ஆட்டோ ஓட்டுநராக ஸ்டைலான லுக்கில் நடிகர் சிலம்பரசன் வீடியோ#Silambarasan |#silambarasantr |#str |#simbu |#tamildiary pic.twitter.com/MDC0JIOzj9 — Tamil Diary (@TamildiaryIn) April 11, 2022 -
త్రీ డేస్ బ్రాండ్ డేస్
స్టార్స్‌కు సినిమాలతో పాటు బ్రాండ్ అడ్వటైజ్మెంట్లు కీలకం. తరచూ ఏదో ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేస్తూ టీవీల్లోనో, హోర్డింగ్స్లోనో కనిపిస్తూనే ఉంటారు. సూపర్ స్టార్స్‌కి అయితే ఈ డీల్స్ చాలా ఎక్కువ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కూడా చాలా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ లాక్‌డౌన్‌లోనూ కొన్ని కొత్త ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారామె. అయితే లాక్డౌన్ కారణంగా ఈ యాడ్ల చిత్రీకరణ నిలిచిపోయింది. ఆగిపోయిన యాడ్ షూటింగ్స్ అన్నీ ఆగకుండా పూర్తి చేయాలని ‘త్రీ డేస్ – బ్రాండ్ డేస్’ ప్లాన్ చేశారామె. ఈ వారంలో ఓ మూడు రోజుల పాటు యాడ్ షూటింగ్స్‌కే కేటాయించారట. ఈ మూడు రోజులూ నిర్విరామంగా షూటింగ్స్ చేస్తుంటారట దీపిక. ఈ యాడ్స్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత తన తదుపరి సినిమా చిత్రీకరణ కోసం గోవా ప్రయాణమవ్వనున్నారు దీపికా పదుకోన్. -
షూటింగ్లో గాయపడిన హీరోయిన్
లండన్: ఓ యాడ్ షూటింగ్ కోసం లండన్ వెళ్లిన అమీ జాక్సన్ గాయపడింది. షూటింగ్ సందర్భంగా పరిగెత్తుతుండగా అనుకోకుండా జారి పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆమె కాలికి డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి ఏం పరవాలేదని చెప్పారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారని నటి సన్నిహితులు మీడియాకు తెలిపారు. అమీ స్వస్థలం లండన్ అన్న విషయం తెలిసిందే. మొదట గాయాన్ని లెక్కచేయకుండా షూట్ కంటిన్యూ చేయగా.. నొప్పి ఎక్కువ కావడంతో యూనిట్‌కు చెప్పిందట. వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అమీ జాక్సన్ కు స్వల్ప గాయమేనని తెలియడంతో '2.0' మూవీ యూనిట్ రిలాక్స్ అయింది. ఎందుకంటే సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ '2.0'లో హీరోయిన్గా అమీ జాక్సన్ నటిస్తోంది. ఈ మూవీని దీపావళికి తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నారు.