50 సెకన్ల ప్రకటన.. అదిరిపోయే రేంజ్‌లో 'నయనతార' రెమ్యునరేషన్‌ | Nayanthara Shocking Remuneration For Commercial Ads For 50 Seconds, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

50 సెకన్ల ప్రకటన.. అదిరిపోయే రేంజ్‌లో 'నయనతార' రెమ్యునరేషన్‌

Jul 12 2025 7:01 AM | Updated on Jul 12 2025 10:56 AM

Nayanthara Remuneration For Commercial Ads For 50 Seconds

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది పాత సామెతే అయినా ఎవరైనా ఎప్పుడూ అమలు పరచేదే. ఇందుకు సంచలన తార నయనతార అతీతం కాదు. ఈమె చాలా కష్టపడి కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన నటి. కేరళలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నటనపై ఆసక్తితో పలు అవమానాలు, అవరోధాలు ఎదుర్కొని కథానాయకిగా నిరూపించుకున్నారు. అయితే దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తానని బహుశ ఆమె కూడా ఊహించి ఉండరు. కోలీవుడ్‌లో అయ్యా చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న నయనతార ఆ తరువాత రజనీకాంత్‌కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌గా వెలిగపోతున్నారు. 

ఈమె మొదటి నుంచి సంచనాలకు చిరునామా అని చెప్పవచ్చు. మొదట్లో ప్రేమ, ఆ తరువాత పెళ్లి, ఆపై సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి, నిర్మాత ఇలా ఒక్కో ఘట్టంలోనూ వివాదాలు, విమర్శలను తొక్కుకుంటూ తన స్థాయిని నిలబెట్టుకుంటున్న నయన్ ఇప్పటికీ స్టార్‌ హీరోలతో జత కడుతూ బిజీగా ఉన్నారు. ఈ భామ చిత్రానికి రూ.10 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా 50 సెకన్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సాయాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంటే ఈమె ఒక సెకన్‌ పారితోషకం అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. 

అయితే, ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిందని సమాచారం.  నయనతార సాధారణంగా యాడ్స్‌ చేయడం చాలా అరుదు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్‌ చేస్తారు. ఇది చూసి ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్‌కు అంత రెమ్యునరేషన్ తీసుకోరు. నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్‌కు తగ్గట్టే దూసుకుపోతున్నారు. ఇకపోతే కోలీవుడ్‌లో ఇటీవల నయన చిత్రాలేమీ విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈమె క్రేజ్‌ ఏమాత్రం దగ్గలేదనడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది తెరపైకి రావడానికి చిత్రం సిద్ధం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement