ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'అవును, ఆ రూమర్‌ నిజమే' అంటున్న రష్మిక.. ‍అతడితో..

Published Tue, Jul 12 2022 8:26 PM

Rashmika Mandanna Revealed Shoot With Tiger Shroff - Sakshi

Rashmika Mandanna Shoot With Tiger Shroff: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది ఈ నేషనల్‌ క్రష్‌. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్‌ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్‌ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్‌బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల రష్మిక మందన్నాపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అందులో ఒక రూమర్‌ నిజమే అని తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. 

రష్మిక మందన్నా, బాలీవుడ్ యంగ్‌ హీరో టైగర్ ష్రాఫ్‌ కలిసి ఒక యాడ్‌లో కలిసి నటించారు. దీనికి సంబంధించిన బూమరాంగ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది రష్మిక. ఈ వీడియో పోస్ట్‌ చేస్తూ 'ఆ రూమర్లు నిజమే.. చాలా నవ్వోస్తోంది. నేను, టైగర్ ష్రాఫ్‌ ఒక యాడ్‌ కోసం కలిసి నటించాం. టైగర్ ష్రాఫ్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. ఈ యాడ్ కోసం ఎదురుచూస్తున్నాను' అని రాసుకొచ్చింది. ఈ స్టోరీని టైగర్‌ ష్రాఫ్‌ షేర్‌ చేస్తూ 'షూట్‌ చేయడం సరదాగా ఉంది. నువ్‌ ఎప్పటిలాగే అదరగొట్టావ్‌' అని క్యాప్షన్‌ ఇచ్చాడు. సో.. రష్మిక నిజమని చెప్పిన రూమర్‌ ఇదన్నమాట. 

చదవండి: అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్‌
'ఆర్‌ఆర్‌ఆర్‌'పై పోర్న్‌ స్టార్‌ ట్వీట్‌.. నెట్టింట జోరుగా చర్చ


Advertisement
 
Advertisement
 
Advertisement