Naga Chaitanya's Thank You Movie Trailer Is Out Now - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఆకట్టుకుంటున్న నాగ చైతన్య 'థ్యాంక్యూ' ట్రైలర్‌..

Jul 12 2022 7:55 PM | Updated on Jul 12 2022 8:11 PM

Naga Chaitanya Thank You Movie Trailer Released - Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్‌ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్‌ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్‌ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 

మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ను 'ఇట్స్‌ ఏ లాంగ్‌ జర్నీ మై ఫ్రెండ్‌' అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్స్‌తో ముగించారు. లవ్‌ ఫీల్‌తో ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్‌. క్లాస్, మాస్ గెటప్‌లో నాగ చైతన్య కనిపించి ఆకట్టుకునేలా ఉన్నాడు. డైలాగ్స్‌, తమన్‌ సంగీతం బాగుంది. లవ్, కెరీర్‌ వంటి తదితర అంశాలను సినిమాలో ప్రస్తావించనున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్, నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం వల్ల 'థ్యాంక్యూ'పై అంచనాలు నెలకొన్నాయి. 

చదవండి: ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్‌
'ఆర్‌ఆర్‌ఆర్‌'పై పోర్న్‌ స్టార్‌ ట్వీట్‌.. నెట్టింట జోరుగా చర్చ


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement