'ఆర్‌ఆర్‌ఆర్‌'పై కేండ్రా లస్ట్‌ ట్వీట్‌.. నెట్టింట జోరుగా చర్చ

Porn Star Kendra Lust Tweet On RRR Movie Goes Viral - Sakshi

Kendra Lust Tweet On RRR: జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. అంతేకాకుండా ఈ సినిమాపై హాలీవుడ్ రచయితలు, దర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. 

తాజాగా ఈ మూవీని ఒక పోర్న్‌ స్టార్‌ పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన పోర్న్‌ స్టార్‌ కేండ్రా లస్ట్‌ ట్విటర్‌ వేదికగా కొనియాడింది. ''నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ నటన, స్టంట్స్‌, డైలాగ్‌ డెలీవరీ, పాటలు, సినిమాటోగ్రఫీ .. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉంది. హీరోలిద్దరూ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. వారిద్దరి నటన 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు ఆత్మలాంటింది'' అని ట్వీటింది కేండ్రా లస్ట్‌. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై కేండ్రా లస్ట్‌  ట్వీట్ చేయడం గురించి నెటిజన్లు జోరుగా డిస్కషన్‌ పెట్టారు. మరిన్ని ఇండియన్‌ మూవీస్‌ చూసి తన అభిప్రాయం చెప్పమని కోరుతున్నారు. అలాగే 'డాక్టర్‌ స్ట్రేంజ్‌' రైటర్‌ సి రాబర్ట్‌ గిల్‌, 'స్పైడర్‌ మ్యాన్‌ వర్స్‌' రైటర్‌, నిర్మాత క్రిస్టోఫర్ మిల్లర్‌ తదితరులు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను వీక్షించి ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్‌ హీరోయిన్‌
36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్‌.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్‌ హిట్‌.. 
నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్‌
ధనుష్‌ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్‌ దర్శకులు..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top