కవల పిల్లలు.. ముందుగా ఎవరు జన్మించారంటే: చిరంజీవి | Chiranjeevi Comments On His Twin Grandchildren | Sakshi
Sakshi News home page

కవల పిల్లలపై స్పందించిన చిరంజీవి

Feb 1 2026 12:20 PM | Updated on Feb 1 2026 1:48 PM

Chiranjeevi Comments On His Twin Grandchildren

రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారికి ఇప్పటికే క్లీంకార కూతురు  ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక మగ, ఆడ బిడ్డ జన్మించడంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా  చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చాలా సంతోషంగా కనిపించారు. ఇద్దరూ మెగా క్వీన్స్‌తో పాటు మెగా వారసుడు వచ్చాడని అభిమానులు కేరింతలకు చిరు మరింత సంతోషంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

'కవల పిల్లల రాకతో మాలో మరింత సంతోషం పెరిగింది. ఈ వార్త తెలుసుకున్న తర్వాత కొణిదెల ఫ్యామిలీతో పాటు కామినేని కుటుంబ సభ్యులందరం చాలా సంతోషంగా ఉన్నాం. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన ,  బిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పటి నుంచో  ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలని  కోరుకున్నారు. ఆ భగవంతుడు దయ వల్ల హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ ఒక మగ బిడ్డ జన్మించారు. ఈ వార్తను మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఈ సందర్భాన్ని అభిమానులు పండుగ లాగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల  ఆనందానికి అవధులు లేవు. మా కుటుంబంపై ప్రేమను చూపించే అందరికీ కృతజ్ఞతలు' అంటూ చిరంజీవి పేర్కొన్నారు.  అయితే, కవల పిల్లల్లో ముందుగా అబ్బాయి జన్మించాడని.. కొన్ని నిమిషాల తర్వాతే అమ్మాయి జన్మించదని కామినేని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement