'నాకు నిజంగానే తెలియదండి'.. హీరోయిన్ లయ కామెంట్స్ | Tollywood actress Laya comments about food name in Telugu | Sakshi
Sakshi News home page

Laya: 'నాకు నిజంగానే తెలియదండి'.. హీరోయిన్ లయ కామెంట్స్

Feb 1 2026 11:06 AM | Updated on Feb 1 2026 12:19 PM

Tollywood actress Laya comments about food name in Telugu

నితిన్ మూవీ తమ్ముడుతో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లయ. ప్రస్తుతం హీరోయిన్‌ కాకపోయినా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అవకాశాలతో దూసుకెళ్తోంది. తమ్ముడు మూవీ హిట్‌ కొట్టకపోయినా లయకు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. అప్పట్లో సూపర్ హిట్ కాంబో అయిన శివాజీతో జతకట్టింది. వీరిద్దరు నటించిన తాజా చిత్రం సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. తాజాగా ఈ మూవీ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు హాజరైన లయ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు పాయ అంటే కూడా తెలియదని చెప్పింది. ఈ మూవీలో పాయా అంటూ సాగే సాంగ్‌ను ఉద్దేశించి లయ మాట్లాడింది. ఆ మాత్రం కూడా తెలియదా అని మీరు అనుకోవచ్చు కానీ.. నిజంగానే నాకు పాయా అంటే ఏంటో తెలియదండీ అని లయ అమాయకంగా చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు లయకు నిజంగానే తెలియదా అంటూ నోరెళ్లబెడుతున్నారు. పాయా అంటే ఓ రకమైన నాన్ వెజ్ వంటకమని మనందరికీ తెలిసిందే. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement