క్లీంకారకు ప్రమోషన్.. మెగా కోడలు ఆసక్తికర ట్వీట్ | Lavanya Tripathi Congratulations To Upasana Konidela And Ram Charan For Twins, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: క్లీంకారకు ప్రమోషన్.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి ట్వీట్

Feb 1 2026 11:39 AM | Updated on Feb 1 2026 12:49 PM

Lavanya Tripathi Congratulations To Upasana and ram charan for twins

మెగా హీరో రామ్ చరణ్ దంపతులు మరోసారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఓ పాప, బాబు పుట్టారని చిరు రివీల్ చేశారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌ సైతం ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా హీరో రామ్ చరణ్‌ దంపతులకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి అభినందనలు తెలిపారు. ట్విన్స్‌కు జన్మనిచ్చిన ఉపాసనకు కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. హాయ్ చిట్టి కవలలు.. ఈ ప్రపంచంలో మీకు స్వాగతం.. ఇప్పటికే మిమల్ని అందరూ చాలా ప్రేమిస్తున్నారంటూ లావణ్య రాసుకొచ్చింది. క్లీంకార ఇప్పుడు అఫీషియల్‌గా అక్కగా ప్రమోషన్ పొందిందని లావణ్య త్రిపాఠి ట్లీట్ చేసింది. మీ చిన్న కజిన్ వాయువ్ మీతో కలిసి పెరిగేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ గతేడాది ఓ కుమారుడు జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి వాయువ్ అని నామకరణం చేశారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. లావణ్య త్రిపాఠి మాత్రం ఎలాంటి కొత్త సినిమాలైతే ప్రకటించలేదు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement