విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో తెలీదు. ఈ అంశంపై ఆయన అభిమానులు భగ్గుమంటున్నారు. నిర్మాతకు కోట్లలో నష్టం వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే దర్శక నిర్మాతలు స్పందించారు. అయితే, తాజాగా విజయ్ తొలిసారి జన నాయగన్ వాయిదాపై మాట్లాడారు.
ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ పలు వ్యాఖ్యలు చేశారు. సినిమాను ఇలా అడ్డుకోవడం చాలా బాధ అనిపించిందని పేర్కొన్నారు. ఈ మూవీ నిర్మాతను తలుచుకుంటేనే తనకు బాధ కలుగుతోందని పేర్కొన్నారు. తాను రాజకీయ ప్రవేశం చేయడం వల్ల తనకు ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించానన్నారు. అందుకు తాను మెంటల్‌గా సిద్ధం అయినట్లు నటుడు విజయ్ పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాత వెంకట్ కె.నారాయణ కూడా పలుమార్లు విడుదల ఆలస్యంపై బాధపడ్డారనేది తెలిసిందే.
సెన్సార్ చిక్కువల వల్ల జనవరి 9న విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ వాయిదా పడింది. కనీసం విడుదల ఎప్పుడు అనేది కూడా క్లారిటీ లేదు. దర్శకుడుహెచ్ .వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో చివరిది కావడం విశేషం. ఇందులో పూజా హెగ్డే కథానాయకిగా నటించగా మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్ర పోషించారు.


